AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 2.0 Launch Live: బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు.. మరిన్ని ఊహించని ట్విస్ట్‌లు

Bigg Boss 7 Telugu 2.0 Grand Launch Live Updates:14 మందిని హౌస్ లోకి పంపించారు. అయితే వీరు ఎవరు హౌస్ లో హౌస్ మేట్స్ కాదు అని గేమ్ ఆడి పవర్ అస్త్రాలను గెలుచుకుంటేనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అవుతారు అని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే గేమ్ ఆడుతున్నారు ఇప్పటికే హౌస్ నుంచి నలుగురు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఈ వారం ఒకరు హౌస్ నుంచి బయటకు రానున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి మరికొంతమంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 2.ఓ అంటూ బిగ్ బాస్ రీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది.

Bigg Boss Telugu 2.0 Launch Live: బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు.. మరిన్ని ఊహించని ట్విస్ట్‌లు
Bigg Boss 7 Telugu New
Rajeev Rayala
|

Updated on: Oct 08, 2023 | 10:10 PM

Share

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా గా ఉండనుందని ముందు నుంచి నాగార్జున చెప్తూ వస్తున్నారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లో ముందుగా 14 మందిని హౌస్ లోకి పంపించారు. అయితే వీరు ఎవరు హౌస్ లో హౌస్ మేట్స్ కాదు అని గేమ్ ఆడి పవర్ అస్త్రాలను గెలుచుకుంటేనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అవుతారు అని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే గేమ్ ఆడుతున్నారు ఇప్పటికే హౌస్ నుంచి నలుగురు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఈ వారం ఒకరు హౌస్ నుంచి బయటకు రానున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి మరికొంతమంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 2.ఓ అంటూ బిగ్ బాస్ రీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది.

నేటి ఎపిసోడ్ లు బిగ్ బాస్ స్టేజ్ పై ఇద్దరు స్టార్ హీరోలు సందడి చేయనున్నారు. మాస్ మహారాజ రవితేజ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నాడు. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరావు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పై హంగామా చేయనున్నారు.

అలాగే మరో హీరోగా సిద్దార్థ్ కూడా బిగ్ బాస్ సీజన్ 7 లో సందడి చేయనున్నాడు. ఆయన నటించిన చిన్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సిద్దార్థ్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నాడు. హౌస్ లోకి వెళ్లి హౌస్ లోనివారితో గేమ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోలు వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే కొత్తవారు ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

‏మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Oct 2023 10:10 PM (IST)

    టైటిల్ విన్నర్ డైమెండ్ సెట్ ఆఫర్

    బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చాలా లక్షల విలువైన డైమెండ్ సెట్ ఇవ్వనున్నారు. పూజా, నయని, భోలా కి బెడ్ రూమ్స్ హెడ్స్ చేశారు. ఎవరు ఎక్కడ పడుకోవాలి ఈ ముగ్గురు నిర్ణయించనున్నారు. ఎవరి డ్యూటీ కరెక్ట్ గా చేయాలో కెప్టెన్ ప్రశాంత్ చూసుకోనున్నాడు. మొత్తం 14 మంది హౌస్ మేట్స్ అయ్యారు.

  • 08 Oct 2023 10:02 PM (IST)

    హౌస్‌లో ఉన్నవారితో ఆడుకున్న రవితేజ, నాగార్జున

    హౌస్ లో ఉన్న వారు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి ఇవ్వాలంటే ఒక్కక్కరు ఒకొక్క టాస్క్ ఇచ్చారు నాగార్జున. గాయత్రీ భరద్వాజ్ కోసం యావర్ 50 పుషాప్స్ చేశాడు. శోభా తేజకు మేకప్ వేసింది. అలాగే నుపూర్  సనన్ ను 2 నిమిషాలు పొగిడిన సందీప్ మాస్టర్. డ్యాన్స్ చేసి ఆకట్టుకున్న ప్రశాంత్. డాన్స్ తో అదరగొట్టిన తేజ, శోభా శెట్టి.

  • 08 Oct 2023 09:53 PM (IST)

    రవితేజను చూసి ఎక్జైట్ అయిన అమర్ దీప్

    రవితేజ ను చూసి ఎక్జైట్ అయిన అమర్ దీప్. తనకు పెద్ద ఫ్యాన్ ను అని చెప్పిన నాగార్జున.

  • 08 Oct 2023 09:44 PM (IST)

    బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన మాస్ మహారాజ

    బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన మాస్ మహారాజ రవితేజ. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కు వచ్చిన రవితేజ

  • 08 Oct 2023 09:36 PM (IST)

    నయని పావనికి టాస్క్ ఇచ్చిన నాగ్..

    నయని పావనికి టాస్క్ ఇచ్చిన నాగ్.. యావర్, తేజ, ప్రశాంత్ ఫొటోస్ చూపించగా.. యావర్ ను డేట్ చేస్తా.. తేజ ప్రెండ్, ప్రశాంత్ ను పెళ్లి చేసుకుంటా అని తెలిపింది

  • 08 Oct 2023 09:33 PM (IST)

    నయని పావని ఎంట్రీ

    బిగ్ బాస్ హౌస్ లోకి చివరి కనెటస్టెంట్ గా యూట్యూబర్ నయని పావని ఎంట్రీ ఇచ్చింది . అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది నయని పావని.

  • 08 Oct 2023 09:25 PM (IST)

    పూజా మూర్తిని సర్ప్రైజ్ చేసిన నాగ్

    తన తండ్రికి ఎక్కువగా ఇష్టమైన పుదీనా చికెన్ ను ఇచ్చిన నాగార్జున. ఎమోషనల్ అయిన పూజా మూర్తి

  • 08 Oct 2023 09:20 PM (IST)

    హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి

    బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి. అంతకు ముందే బిగ్ బాస్ కు వెళ్లాల్సి ఉండగా తన తండ్రి చనిపోయారు అని తెలిపింది పూజా. పలు సీరియల్స్ లో నటించింది పూజా.

  • 08 Oct 2023 09:08 PM (IST)

    హౌస్‌లోకి మ్యూజిక్ కంపోజర్ భోలే షావలి..

    మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. ఫోక్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన భోలే షావలి.. తనను తాను పాట బిడ్డగా పరిచయం చేసుకున్న భోలే షావలి. నాగార్జున పై పాట పాడిన భోలే షావలి.

  • 08 Oct 2023 09:01 PM (IST)

    రావడంతో అర్జున్, అశ్వినికి కొత్త బాధ్యత

    రావడంతో అర్జున్, అశ్వినికి కొత్త బాధ్యత ఇచ్చారు నాగార్జున. హౌస్ లో ఉన్న వారికి ఏ లగేజ్ ఇవ్వాలి అనేది అర్జున్, అశ్విని నిర్ణయిస్తారు అని చెప్పాడు నాగార్జున.

  • 08 Oct 2023 08:55 PM (IST)

    దుమ్ము దుమ్ముగా ఆ ఇద్దరు ఆడుతున్నారు : అశ్విని

    దమ్ముగా ఆడుతుంది శివాజీ, ప్రశాంత్.. దుమ్ము దుమ్ముగా ప్రియాంక, శోభా శెట్టి ఆడుతున్నారని చెప్పింది అశ్విని

  • 08 Oct 2023 08:51 PM (IST)

    హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి అశ్విని

    అశ్విని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆకట్టుకునే డాన్స్ పర్ఫామెన్స్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది నటి అశ్విని

  • 08 Oct 2023 08:47 PM (IST)

    ఆ ముగ్గురు నాకు పోటీ: అర్జున్

    దమ్ముగా యావర్, ప్రశాంత్ ఆడుతున్నారని, దుమ్ము దుమ్ముగా అమర్ దీప్, సందీప్ ఆడుతున్నారు అంటూ నాగార్జున కు చెప్పాడు అంబటి అర్జున్. యావర్, ప్రశాంత్, శివాజీ లతో పోటీ పడాలనుకుంటున్నా అని చెప్పాడు అర్జున్

  • 08 Oct 2023 08:42 PM (IST)

    హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి అర్జున్ 

    వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సీరియల్ నటుడు అంబటి అర్జున్. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు అర్జున్

  • 08 Oct 2023 08:40 PM (IST)

    హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్స్

    వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్.. ఐదుగురు కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు నాగార్జున

  • 08 Oct 2023 08:24 PM (IST)

    హౌస్ మేట్స్‌తో పాటలు పాడిస్తూ, డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన సిద్దార్థ్

    హౌస్ మేట్స్ తో పాటలు పాడిస్తూ, డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన సిద్దార్థ్

  • 08 Oct 2023 08:10 PM (IST)

    బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన సిద్దార్థ్ . 

    బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన సిద్దార్థ్.  చిన్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కు గెస్ట్ గా వచ్చిన సిద్దార్థ్.

  • 08 Oct 2023 08:04 PM (IST)

    సీక్రెట్ రూమ్‌కి గౌతమ్ కృష్ణ

    ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నాగ్. గౌతమ్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు. గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లో ఉంచాడు నాగ్

  • 08 Oct 2023 07:51 PM (IST)

    తేజ సేఫ్.. గౌతమ్ ఎలిమినేట్

    నామినేషన్స్ లో గౌతమ్, తేజ ఉన్నారు. వీరిలో ఒకరిని సేఫ్ చేసి ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయం హౌస్ మేట్స్ డిసైడ్ చేయాలనీ చెప్పాడు నాగ్. దాంతో అందరు తమ నిర్ణయం చెప్పారు. తేజ సేఫ్ అయ్యాడు , గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు

  • 08 Oct 2023 07:44 PM (IST)

    అమర్ దీప్ సేఫ్.. అలాగే హౌస్ మెట్ కూడా..

    తేజ, అమర్ దీప్, తేజ నామినేషన్ లో ఉన్నారు.  వీరిలో ఒకరు సేఫ్ కానున్నారు. గార్డెన్ ఏరియాలో ఫొటోస్ ఉంచి అవి తగలబడకుండా ఉన్న వారు సేఫ్ అవుతారు అను చెప్పాడు. ఇందులో అమర్ దీప్ విన్ అయ్యాడు.

  • 08 Oct 2023 07:42 PM (IST)

    యావర్ సేఫ్ అవ్వడంతో పాటు హౌస్ మెట్ కూడా..

    నామినేషన్ లో ఉన్న నలుగురిలో ఆడియన్స్ హృదయాన్ని గెలుచుకున్న వారు హౌస్ మేట్ అవుతారు అని చెప్పాడు నాగ్. ఇందులో యావర్ సేఫ్ అయ్యాడు

  • 08 Oct 2023 07:41 PM (IST)

    హౌస్ మేట్స్ గా శోభా , ప్రశాంత్, సందీప్, శివాజీ

    హౌస్ లో శోభా , ప్రశాంత్, సందీప్, శివాజీ హౌస్ మేట్స్ అయ్యారు అని చెప్పాడు నాగార్జున

  • 08 Oct 2023 07:39 PM (IST)

    శివాజీ, ప్రియాంక సేఫ్

    మరోసారి నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టాడు నాగ్. కుండలు పగలు కొట్టి ఎవరు సేఫ్ అయ్యారో చెప్పాడు. ఇందులో శివాజీ, ప్రియాంక సేఫ్ అయ్యారు.

  • 08 Oct 2023 07:36 PM (IST)

    టాప్ కంటెస్టెంట్స్ వీళ్ళే

    హౌస్ లో ఎవరు టాప్ లో ఉన్నారు అని అడిగాడు నాగార్జున దాంతో .. ప్రియాంక-  తేజ పేరు,గౌతమ్  – శివాజీ పేరు , తేజ – ప్రియాంక, యావర్ – శివాజీ, అమర్ దీప్ – శివాజీ, శివాజీ – యావర్ పేర్లు చెప్పారు

  • 08 Oct 2023 07:33 PM (IST)

    ఏడుపు మొహం పెట్టిన గౌతమ్

    శుభ శ్రీ రాయగురు ఎలిమినేట్ అవ్వడంతో గౌతమ్ కృష్ణ ఎమోషనల్ అయ్యాడు. సుబ్బు ఎలిమినేట్ అవ్వడంతో గౌతమ్ ఏడుపు మొహం పెట్టేశాడు.

  • 08 Oct 2023 07:27 PM (IST)

    ఎమోషనల్ అయిన శుభ శ్రీ 

    బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ చూసుకొని ఎమోషనల్ అయిన శుభ శ్రీ

  • 08 Oct 2023 07:26 PM (IST)

    ఊహించని ఎలిమినేషన్

    బిగ్ బాస్ హౌస్ లో ఈ వారాం నామినేషన్స్ లో ఉన్న వారిని యాక్టివిటీ రూమ్ కు పిలిపించి శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యిందని అనౌన్స్ చేశారు.

  • 08 Oct 2023 07:23 PM (IST)

    శుభ శ్రీ ఎలిమినేట్

    బిగ్ బాస్ హౌస్ నుంచి శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యింది

  • 08 Oct 2023 07:15 PM (IST)

    బిగ్ బాస్ సీజన్ 7 మరింత రసవత్తరంగా

    బిగ్ బాస్ సీజన్ 7 మరింత రసవత్తరంగా మారనుంది. బిగ్ బాస్ 2.ఓ పేరుతో మరికొంతమంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించనున్నారు

Published On - Oct 08,2023 6:46 PM