Balayya: ఫిల్టర్ లేని మనిషి బాలయ్య.. ప్రేమిస్తే ఇంతే..
యంగ్ హీరోలు అయిన విశ్వక్ సేన్, అడివి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ వంటివారు ఇప్పుడు బాలయ్యకు బాగా క్లోజ్ అయ్యారు. వారి సినిమా పంక్షన్స్‌కు బాలయ్య వెళ్లడం సపోర్ట్ చేయడం వంటివి చేస్తున్నారు.
బాలయ్య బోలా మనిషి.. చిన్నపిల్లాడి మనస్తత్వం.. కల్మషం అనేది తెలియదు అనేది ఆయనకు దగ్గరిగా మెలిగేవాళ్లు చెప్పే మాట. అందుకు తగ్గట్లుగానే బాలయ్య యాక్షన్స్, రియాక్షన్స్ ఉంటాయి. తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తారు.. అభిమానులు ఎవరైనా ఎక్స్‌ట్రాలు చేస్తే.. అక్కడే చెంప చెల్లుమనిపిస్తూ ఉంటారు. అయితే అది క్షణకాల కోపం మాత్రమే. ఆ తర్వాత వారిని దగ్గరికి పిలిచి ఫోటోలు ఇస్తారు. అంతేనా అభిమానులతో కలిసి భోజనం చేయడం, వాళ్లు కష్టంలో ఉన్నప్పుడు సాయం అందించడం బాలయ్య స్పెషాలిటీ.
బాలయ్యకు ఫిల్టర్ అనేది ఉండదు. బయట వాళ్ల కోసం తన ఒరిజినల్ క్యారెక్టర్ చంపుకోరు. ఇక.. ఆయన ఒక మనిషి నమ్మారు అంటే అతని కోసం ఎంతదూరమైనా వెళ్తారు. ఈ మధ్య కాలంలో అలా యువ హీరోలు.. సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌లను దగ్గరికి తీస్తున్నారు బాలయ్య. వాళ్ల ఫంక్షన్స్ లేదా ఈవెంట్స్‌కు వెళ్లి ఆశీర్వదిస్తున్నారు. తాజాగా ఈ ఇరువురు కుర్ర హీరోలు.. ఏపీ వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని బాలయ్యతో కలిసి అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వారు వెళ్లే క్రమంలో.. బాలయ్యకు సిద్దూ బాయ్ చెప్పాడు. ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. దీంతో బాలయ్య అతన్ని ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. వీళ్ళ బాండింగ్ సూపర్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. విశ్వక్ సేన్, అడివి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ.. నా గ్యాంగ్ అంటూ బాలయ్య అప్పుడప్పుడు సరదాగా వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..