Akhanda : నటసింహం ‘అఖండ’గా గర్జించేది అప్పుడేనా.. జక్కన మూవీ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన బాలయ్య..?

నటసింహం గర్జించడానికి సిద్ధంగా ఉంది కానీ ఎప్పుడు..? ఇప్పుడు ఇదే ప్రశ్న బాలయ్య అభిమానులను తొలిచేస్తుంది. అసలే బోయపాటి సినిమా..

Akhanda : నటసింహం 'అఖండ'గా గర్జించేది అప్పుడేనా.. జక్కన మూవీ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన బాలయ్య..?
Akhanda
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 29, 2021 | 8:11 AM

Akhanda : నటసింహం గర్జించడానికి సిద్ధంగా ఉంది కానీ ఎప్పుడు..? ఇప్పుడు ఇదే ప్రశ్న బాలయ్య అభిమానులను తొలిచేస్తుంది. అసలే బోయపాటి సినిమా.. పైగా బాలయ్య డిఫరెంట్ గెటప్స్‌‌లో కనిపించబోతున్నాడు. దాంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అఖండ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈసినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. బాలకృష్ణ -బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా అఖండ. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ప్రస్తుతం అఖండ సినిమా క్లైమాక్స్‌‌‌ను కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. ఈ షెడ్యూల్‌‌‌‌ను తమిళ్ నాడు షూట్ చేస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్‌‌‌‌కు గుమ్మడికాయ కొట్టేస్తారు.ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు పాత్రల్లో కనిపించనున్నారు. వారిలో ఒకటి అఘోర పాత్ర. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అందాల భామ ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే అఖండ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నదానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. దసరా .. దీపావళి .. సంక్రాంతికి సినిమాలు ముందుగానే ఫిక్స్ కావడంతో, ‘అఖండ’ ఎప్పుడు రిలీజ్ కానుందనే విషయం అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళుతోంది. ఇదిలా ఉంటే దసరా బరిలో నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ తప్పుకోనుండటంతో..అదే రోజున ‘అఖండ’ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారని తెలుస్తుంది. దాంతో బాలయ్య సినిమాను  అదే రోజున తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. మరో వైపు అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నరు బాలయ్య. అలాగే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి, పూరిజగన్నాథ్ డైరెక్షన్‌లోనూ మూవీస్ చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagarjuna Akkineni: కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్ ఫోటో గ్యాలెరీ.. మీరు ఒక లుక్ వేయండి..

Maestro: మాస్ట్రో అఫీషియల్ డేట్ వచ్చేసింది.. హాట్‌స్టార్‌ ప్రకటించింది.. ఎప్పుడో తెలుసా.!

PV Sindhu: పీవీ సింధుకు సినీ ప్రముఖుల సన్మానం.. వీడియోను షేర్‌ చేసిన చిరంజీవి