Nandamuri Bala Krishna : బాలయ్య బరిలోకి దిగేది అప్పుడేనా..? NBK 107 లేటెస్ట్ ఆప్డేట్
నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ హీరోలందరితో బాలయ్య బాబుకు ఉన్న క్రేజ్ వేరు.
నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Bala Krishna) సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ హీరోలందరితో బాలయ్య బాబుకు ఉన్న క్రేజ్ వేరు. ఆయన సినిమా వస్తుందంటే సంబరాలు అంబరాన్ని అంటేలా చేస్తారు అభిమానులు. ఇటీవలే అఖండ సినిమా తో సంచలన విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వలో వచ్చిన అఖండ సినిమా నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో బాలయ్య నటవిశ్వరూపం ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించింది. దాంతో ఇప్పుడు బాలయ్య నెక్స్ట్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా తెరకెక్కిస్తున్నాడు గోపీచంద్ మలినేని.
బాలయ్య కెరీర్ లో 107 వ సినిమాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు గోపీచంద్. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య సినిమా రిలీజ్ గురించి ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మామూలుగానే బాలయ్య సినిమా అంటే పండగలకు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు NBK 107 కూడా పండగను టార్గెట్ చేసుకోనే రిలీజ్ అవ్వడానికి రెడీవవుతుందని తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఇప్పుడు మరో పెద్ద పండగకు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 2023 సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా ఉండేలా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే సంక్రాంతి కి చాలా మంది స్టార్ హీరోల సినిమాలుకూడా రిలీజ్ అవ్వనున్నాయి. మరి బాలయ్య సినిమా సంక్రాంతికి రంగంలోకి దిగుతుందో లేక మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకుంటుందో చూడాలి.