Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను సొంత కొడుకులా ఫీలయ్యాను.. ‘గబ్బర్ సింగ్’ అనుభవాలను గుర్తుచేసుకున్న నాగినీడు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో గబ్బర్ సింగ్ ఒకటి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. పవన్ తల్లిదండ్రులుగా సుహాసిని, నాగినీడుగా కనిపించారు. సినిమా క్లైమాక్స్‌లో పవన్, నాగినీడుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే పవన్ కల్యాణ్‌తో కలిసి నటించడంపై తన అనుభవాలను పంచుకున్నారు నాగినీడు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో గబ్బర్ సింగ్ ఒకటి. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. పవన్ తల్లిదండ్రులుగా సుహాసిని, నాగినీడుగా కనిపించారు. సినిమా క్లైమాక్స్‌లో పవన్, నాగినీడుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే పవన్ కల్యాణ్‌తో కలిసి నటించడంపై తన అనుభవాలను పంచుకున్నారు నాగినీడు. పవన్ కల్యాణ్ పెద్ద హీరో అయినా కూడా ఆయన ప్రవర్తనలో ఏమీ తేడా ఉండదని పవర్ స్టార్‌పై ప్రశంసల వర్షం కురిపించారాయన. ‘సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ పెద్ద హీరో. అయినా ఆయన ప్రవర్తనలో తేడా ఏమీ ఉండదు. సెట్‌కు సాధారణ వ్యక్తిలాగా వస్తాడు. సైలెంట్‌గా ఉంటాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడాడు. ఎవరో ఒక వ్యక్తిని మాత్రమే ముందు కూర్చొబెట్టుకుని మాట్లాడుతుంటాడు. ఇక ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో నా పాత్రకు హార్ట్ ఎటాక్ వస్తుంది. డైలాగులు చెప్పిన తర్వాత నా చేయి పెట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఆ సందర్భంలో పవన్‌ను ఒక సొంత కుమారుడిలా ఫీలయ్యాను. ఈ సీన్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. ఇక్కడ గొప్పదనమంతా పవన్‌దే. ఒక నటుడు రాణించాలంటే.. పక్కన ఉన్న నటులు రాణించాలి. నా వల్ల ఒకరు చేయాలి. ఒకరి వల్ల నేను చేయాలి. నా ఒక్కరితోనే ఏదీ కాదు’ అంటూ గబ్బర్ సింగ్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు నాగినీడు.
రాజమౌళి మర్యాద రామన్న సినిమాతో మొదలై
రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నాగినీడు. అందులో ఆయన నటించిన రామినీడు పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది. అంతేగాక బెస్ట్ విలన్‌గా నంది పురస్కారం కూడా వచ్చింది. మర్యాద రామన్న సినిమా తర్వాత కూడా పలు గుర్తుండిపోయే పాత్రలు చేశారాయన. వేదం, పిల్ల జమీందార్, ఇష్క్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మిర్చి, బెంగాల్ టైగర్, స్పైడర్, భాగమతి, రూలర్, వెంకీమామ, యాత్ర, వకీల్ సాబ్, ఓరి దేవుడా వంటి హిట్ సినిమాల్లో నటించారాయన.
పవన్ కల్యాణ్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్
View this post on Instagram
ఇన్ స్టా గ్రామ్ లో పవన్ కల్యాణ్ మొదటి పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..








