S. J. Suryah: మహేష్ బాబుకు హిట్ ఇవ్వలేకపోయాను.. త్వరలోనే సినిమా చేస్తా.. ఎస్.జే సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఖుషి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూర్య. ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు నటుడుగా చేస్తూనే మరోవైపు దర్శకుడిగానూ సినిమాలు చేస్తున్నారు సూర్య. ముఖ్యంగా ఆయన విలన్ పాత్రలతో మెప్పిస్తున్నారు. అలాగే కొన్ని సినిమాల్లో తన కామెడీ తో నవ్విస్తున్నారు. రీసెంట్ గా సూర్య మార్క్ అంథోని అనే సినిమాలో నటిస్తున్నారు. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజే చేశారు.

తమిళ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ జే సూర్య. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఖుషి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూర్య. ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు నటుడుగా చేస్తూనే మరోవైపు దర్శకుడిగానూ సినిమాలు చేస్తున్నారు సూర్య. ముఖ్యంగా ఆయన విలన్ పాత్రలతో మెప్పిస్తున్నారు. అలాగే కొన్ని సినిమాల్లో తన కామెడీ తో నవ్విస్తున్నారు. రీసెంట్ గా సూర్య మార్క్ అంథోని అనే సినిమాలో నటిస్తున్నారు. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజే చేశారు.
ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో విశాల్ , సూర్య డిఫరెంట్ లుక్స్ లో కనిపించి మెప్పించారు. ముఖ్యంగా ఎస్ జే సూర్య తన కామెడీతో నవ్వులు పూయించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
View this post on Instagram
ఈ కార్యక్రమంలో ఎస్ జే సూర్య మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దర్శకుడిగా తమిళ్ లో అజిత్ కు సూపర్ హిట్ ఇచ్చా.. అలాగే విజయ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చా అని తెలిపారు. అలాగే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఖుషి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాను కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాత్రం హిట్ ఇవ్వలేకపోయాను. ఆయనకు బాకీ పడ్డాను. త్వరలోనే ఆయనతో ఓ సినిమా చేసి హిట్ ఇస్తాను అని తెలిపారు ఎస్ జే సూర్య. మహేష్ బాబుతో సూర్య నాని అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ప్రయోగాత్మక చిత్రం నాని ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటన, ఏ ఆర్ రెహమాన్ సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా నటించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
