AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Shaurya: ఆ విషయాన్నీ గుర్తు చేద్దామని ఈ సినిమా తీశాం.. నాగ శౌర్య ఇంట్రస్టింగ్ కామెంట్స్..

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది.

Naga Shaurya: ఆ విషయాన్నీ గుర్తు చేద్దామని ఈ సినిమా తీశాం.. నాగ శౌర్య ఇంట్రస్టింగ్ కామెంట్స్..
Naga Shaurya
Rajeev Rayala
|

Updated on: Dec 09, 2021 | 9:20 PM

Share

Naga Shaurya: నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా హీరో నాగ‌శౌర్య  సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీసెంట్ గా రిలీజ్ అయిన వరుడు కావలెను సినిమా నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్ని సార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు లక్ష్య సినిమా రాబోతోంది. లక్ష్య ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

ఇక కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని అనుకున్నాను. కొత్త నాగ శౌర్యను చూపించాలని అనుకున్నాను. ఇలాంటి కథలు రావడమే అదృష్టం. ఇలాంటివి వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవ్వరైనా ఓ అడుగు ముందుకు వేస్తారు. నేను కూడా అదే చేశాను అన్నారు. అలాగే సంతోష్ గారు వచ్చి దాదాపు నాలుగు గంటల పాటు ఫస్ట్ హాఫ్‌ను నెరేట్ చేశారు. ప్రతీది విడమరిచి చెప్పారు. బాణం ఎలా పట్టుకోవాలి.. ఎలా నిల్చోవాలి అంటూ ఇలా అన్నీ వివరించి చెప్పారు. కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను.

ఆర్చరీ మనకు తెలియంది కాదు. పురాణాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం.. మన వీరుల చేతుల్లో విల్లు ఉంటుంది. ఈ రోజు విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లోనూ రామ్ చరణ్ గారు బాణంతో కనిపించారు. అన్నింటిని ఆటలు అని అంటాం కానీ ఒక్క ఆర్చరీని మాత్రమే విలు విద్య అని అంటాం. దాన్ని మనం ఎడ్యుకేషన్‌గా గౌరవిస్తాం. మన వాళ్లు దాన్ని మరిచిపోయారు. కాస్త గుర్తు చేద్దామని ఈ సినిమా తీశాం అన్నారు. ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్‌గా వెళ్లాలంటే చాలా కష్టం. కానీ ఈ సినిమా కోసం ఆర్చరీని నేర్చుకున్నాను. 35 కేజీలను వెనక్కి లాగడం మామూలు విషయం కాదు. ఎన్నో గాయాలు కూడా అవుతుంటాయి. ఈ సినిమా కోసం మూడు రోజులు మాత్రమే శిక్షణ తీసుకున్నాను అని శౌర్య చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Genelia Deshmukh: సెకండ్ ఇన్నింగ్స్‌ షురూ చేసిన హాసినీ.. మరాఠీ చిత్రం కోసం మళ్లీ మేకప్‌ వేసుకోనున్న జెనీలియా..

Lance Naik Sai Teja: అమరజవాను సాయి తేజ్ కుటుంబానికి మంచు విష్ణు బాసట.. పిల్లల చదువు ఖర్చులను భరిస్తామంటూ..

RRR Movie Trailer: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ పై సెలబ్రెటీల రియాక్షన్స్.. మాటలు రావడంలేదు అంటూ..