Naga Chaitanya: శోభిత విషయంలో అలా చేయను.. క్లారిటీ ఇచ్చిన నాగ చైతన్య

గతంలో నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఏ మాయచేశావే సినిమాతో సమంత హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా చేశారు. ఈ సినిమా టైం లోనే చై సామ్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేశారు.

Naga Chaitanya: శోభిత విషయంలో అలా చేయను.. క్లారిటీ ఇచ్చిన నాగ చైతన్య
Naga Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 28, 2024 | 4:19 PM

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య త్వరలోనే శోభిత దూళిపాళ్లను వివాహం చేసుకోనున్నాడు. ఇటీవలే ఈ ఇద్దరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. గతంలో నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఏ మాయచేశావే సినిమాతో సమంత హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా చేశారు. ఈ సినిమా టైంలోనే చై, సామ్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేశారు. ఇక పెళ్లి తర్వాత కూడా సమంత నాగ చైతన్య కలిసి మజిలీ సినిమా చేశారు. ఇక ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం అన్యోన్యంగా ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు.

ఇది కూడా చదవండి : Heroine Simran : సిమ్రాన్ కొడుకుని చూశారా.? హాలీవుడ్ హీరోలా ఉన్నాడే..

సోషల్ మీడియా వేదికగా నాగ చైతన్య సమంత విడిడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియక ఫ్యాన్స్ జుట్టు పీక్కున్నారు. ఇప్పటికీ ఈ ఇద్దరూ ఎందుకు విడిపోయారో ఎవరికీ తెలియదు. సమంత చైతన్య విడాకుల పై చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : Devara: ఫ్యాన్స్‌కు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన దేవర టీమ్.. జాన్వీతోపాటు మరో హీరోయిన్ కూడా..

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య శోభిత గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇటీవలే ఓ ఈవెంట్ కు హాజరైన నాగ చైతన్య ను మీరు శోభితతో కలిసి పెళ్లి తర్వాత సినిమా చేస్తారా.? అనే ప్రశ్న ఎదురైంది. దానికి చైతు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. ఇంతకు ముందు చైతూ శోభిత కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. సరైనా స్క్రిప్ట్ దొరికితే శోభితతో కలిసి సినిమా చేస్తారా ? అని అడగ్గా..ఇప్పుడు అలాంటి ప్లాన్స్ ఏవీ లేవన్నారు నాగచైతన్య. మరి ఫ్యూచర్‌లో ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ అనేసినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి :వినాయక చవితి సందర్భంగా విడుదల కానున్న సినిమాలు ఇవే 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.