Naga Chaitanya: క్యాన్సర్‌ బాధిత చిన్నారుల ముఖాల్లో నవ్వులు నింపిన నాగ చైతన్య.. డ్యాన్సులు చేసి, బహుమతులిచ్చి..

టాలీవుడ్ యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య తన మంచి మనసును చాటుకున్నాడు. బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సెయింట్‌ జూడ్స్‌ చైల్డ్‌కేర్‌ సెంటర్‌లో సందడి చేశాడు చైతూ. అక్కడ క్యాన్సర్‌తో పోరాడుతోన్న పిల్లలతో సరదాగా గడిపారు. వారితో ఆటలాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ పిల్లల ముఖాల్లో నవ్వులు నింపారు. అలాగే చిన్నారులకు వివిధ రకాల బహమతులు అందజేశాడు

Naga Chaitanya: క్యాన్సర్‌ బాధిత చిన్నారుల ముఖాల్లో నవ్వులు నింపిన నాగ చైతన్య.. డ్యాన్సులు చేసి, బహుమతులిచ్చి..
Naga Chaitanya

Updated on: Nov 17, 2023 | 9:09 AM

టాలీవుడ్ యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య తన మంచి మనసును చాటుకున్నాడు. బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సెయింట్‌ జూడ్స్‌ చైల్డ్‌కేర్‌ సెంటర్‌లో సందడి చేశాడు చైతూ. అక్కడ క్యాన్సర్‌తో పోరాడుతోన్న పిల్లలతో సరదాగా గడిపారు. వారితో ఆటలాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ పిల్లల ముఖాల్లో నవ్వులు నింపారు. అలాగే చిన్నారులకు వివిధ రకాల బహమతులు అందజేశాడు. తాజాగా వీటికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అందులో హీరో నాగచైతన్యతో ఓ చిన్నారి ఏదో చెబుతుంటే ఎంతో శ్రద్ధగా వింటూ కనిపించాడు చైతూ. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాగచైతన్య చాలా మంచి పనిచేశాడంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంతో అందంగా, స్టైలిష్‌గా కనిపించే నాగ చైతన్య రియల్ లైఫ్‌ లో మాత్రం చాలా సింపుల్‌గా ఉంటాడు. ఇప్పుడు కూడా అదే సింప్లిసిటీతో క్యాన్సర్‌ బాధిత చిన్నారులతో సరదాగా గడిపాడు. వారి ముఖాల్లో నవ్వులు పూయించాడు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది కస్టడీ సినిమాతో మరో డిఫరెంట్ మూవీని ఖాతాలో వేసుకున్నాడు చైతన్య. రిజల్ట్‌ ఎలా ఉన్నా సినిమాలో చైతూ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. NC 23 పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుంది. మత్స్యకారుల జీవితాలను అద్దం పట్టే ఓ యథార్థ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీంతో పాటు విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో దూత గా మన ముందుకు రానున్నాడు నాగ చైతన్య. అతను నటించిన మొదటి వెబ్‌ సిరీస్‌ ఇది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబరు 1 నుంచి దూత స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దూత స్ట్రీమింగ్‌ కు అందుబాటులో ఉండనుంది.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ బాధిత చిన్నారులతో నాగ చైతన్య

మరోసారి సాయి పల్లవితో కలిసి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.