Thandel : బాక్సాఫీస్ వద్ద చైతూ ఊర మాస్.. వంద కోట్లకు చేరువలో తండేల్..

ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతున్న సినిమా తండేల్. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు పాజిటివ్ రివ్యూస్ అందుకుంటుంది. మొదటి రోజు నుంచే ఊహించని కలెక్షన్స్ వసూలు చేస్తూ సత్తా చాటుతుంది. తాజాగా వంద కోట్లకు చేరువలో తండేల్ సంచనలం సృష్టిస్తుంది.

Thandel : బాక్సాఫీస్ వద్ద చైతూ ఊర మాస్.. వంద కోట్లకు చేరువలో తండేల్..
Thandel

Updated on: Feb 12, 2025 | 9:33 PM

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది తండేల్. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా డి.మత్య్సలేశం గ్రామానికి చెందిన మత్య్సకారుల జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో చైతూ, సాయి పల్లవి యాక్టింగ్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, చందు మొండేటి డైరెక్షన్ సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యాడు. చైతన్య కెరీర్‏లో బిగ్గెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది తండేల్.

తండేల్ సినిమా సోమవారం దాదాపు రూ.11 కోట్లు వసూళ్లు సాధించగా.. మంగళవారం రూ.7 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక నాలుగు రోజుల్లో మొత్తం రూ.73.20 కోట్లు వసూలు చేసింది. మొదటి 5 రోజుల్లో రూ.80.12 కోట్ల వసూలు చేసిందని మేకర్స్ వెల్లడించారు. నాగచైతన్య కెరీర్ లో ఇదే హయ్యేస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ రెండు రోజులు ఒక మోస్తరు వసూళ్లు సాధించిన ..ఈ శుక్రవారం తండేల్ కలెక్షన్స్ మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. వాలెంటైన్స్ డే వీక్ కావడంతో శని, ఆదివారాల్లో అత్యధిక కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

తండేల్ సినిమా వంద కోట్లు వసూళ్లు రాబడుతుందని నిర్మాత బన్నీ వాసు మొదటి నుంచి చెబుతునే ఉన్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఇక ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి తండేల్ సినిమా కచ్చితంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో అడియన్స్ మనసులు గెలుచుకున్నాడు నాగచైతన్య.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన