Tollywood: ఓం నమః శివాయ.. అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్న టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
ప్రస్తుతం దేశమంతా ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలుతోంది. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే క్రమంలో వారణాసి, అయోధ్య, కాశీ వంటి పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. అలాతాజాగా ఓ టాలీవుడ్ నటి అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంది. అనంతరం ఫొటోలను నెట్టింట షేర్ చేసింది.

సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు తరలివెళుతున్నారు. అక్కడి పవిత్ర సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అదే సమయంలో ప్రయాగ్ రాజ్ సమీపంలో ఉన్న అయోధ్య, వారణాసి, కాశీ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అరియానా గ్లోరీ అరుణాచల శివుడిని దర్శించుకుంది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంది. వీటికి అరుణాచల శివ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇక మరో బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ యాంకర్ లాస్య కూడా తన ఫ్యామిలీతో కలిసి అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంది. ఆమె వెంట భర్త, పిల్లలు కూడా ఉన్నారు. అలాగే తిరువణ్ణామళై ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు లాస్య దంపతులు. అనంతరం తన యాత్ర కు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. అంతకు ముందు లాస్య మహా కుంభమేళాను కూడా దర్శించుకున్న సంగతి తెలిసిందే.
అరియాన గ్లోరీ విషయానికి వస్తే.. బిగ్ బాస్ గేమ్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ఆమె కూడా ఒకరు. అయితే బిగ్ బాస్ కు రాక ముందు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో అరియాన గ్లోరీ పేరు కాస్త గట్టిగానే వినిపించింది.
అరుణాచలేశ్వరుడి ఆలయం ఎదుట అరియానా గ్లోరీ..
View this post on Instagram
ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది. హౌస్ లోనూ తనదైన ఆట తీరుతో ఆకట్టుకుందీ అమ్మడు. విజేతగా నిలవకపోయినా చాలా రోజుల పాటు బిగ్ బాస్ ఆడియెన్స్ ను అలరించింది. ప్రస్తుతం పలు టీవీషోలతో బిజీగా ఉంటోంది అరియానా. అలాగే పలు సినిమా ఈవెంట్స్ లోనూ సందడి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బోల్డ్ బ్యూటీకి బోలెడు క్రేజ్ ఉంది. ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
సినిమా ఈవెంట్ లో అరియానా గ్లోరీ..
View this post on Instagram
అరుణాచల శివుడి ఆలయం దగ్గర లాస్య..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి