AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya : నాగచైతన్యకు ఉత్తమ నటుడిగా మరో అవార్డ్.. ఉత్తమ నటిగా రష్మిక.. విజేతలు వీరే..

ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలలో నాగచైతన్య, రష్మిక మందన్న ఇద్దరూ ఉత్తమ నటీనటులుగా పురస్కారాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి ఖాతాల్లోకి ప్రతిష్టాత్మక అవార్డ్స్ వచ్చి చేరాయి. అలాగే ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడి సైతం పురస్కారం అందుకున్నారు. అసలు విషయానికి వస్తే..

Naga Chaitanya : నాగచైతన్యకు ఉత్తమ నటుడిగా మరో అవార్డ్.. ఉత్తమ నటిగా రష్మిక.. విజేతలు వీరే..
Naga Chaitanya, Rashmika Ma
Rajitha Chanti
|

Updated on: Apr 09, 2026 | 9:29 AM

Share

టాలీవుడ్ యువసామ్రాట్ నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చైతూ.. ఇప్పుడు వరుస అవార్డులు అందుకుంటున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ పురస్కారాలలో ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. అలాగే ఉత్తమ నటిగా రష్మిక మందన్నా పురస్కారం అందుకుంది. తాజాగా వీరిద్దరు ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) పురస్కారాల్లోనూ విజేతలుగా నిలిచారు. దేశంలోని పన్నెండు సినీ పరిశ్రమలను ఒక తాటిపైకి తీసుకువస్తూ ఈనెల 16న ముంబైలో ఈ పురస్కారాల వేడుకను నిర్వహించనుంది ఈ సంస్థ. అయితే తెలుగు నుంచి తండేల్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నాగచైతన్య.. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకుగానూ ఉత్తమ నటిగా రష్మిక మందన్న ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ చిత్రంగా మిరాయ్ నిలిచింది. ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

ఇక ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు విభాగంలో తెలుగు నుంచి రామ్ జగదీష్ కోర్టు చిత్రానికి ఎంపికయ్యారు. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో మిరాయ్ విజేతగా నిలిచింది. ఉత్తమ హాస్య నటుడిగా మాస్టర్ రేవంత్ (సంక్రాంతికి వస్తున్నాం) అవార్డ్ అందుకోనున్నారు. ఇక తమిళం నుంచి ఉత్తమ నటుడిగా దుల్కర్ సల్మాన్ (కాంత), ఉత్తమ నటిగా సిమ్రాన్ (టూరిస్ట్ ఫ్యామిలీ), ఉత్తమ దర్శకుడిగా మారి సెల్వరాజ్ (బైసన్) ఉత్తమ చిత్రంగా టూరిస్ట్ ఫ్యామిలీ విజేతలుగా నిలిచాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..

కన్నలో కాంతార చాప్టర్ 1 సినిమాకు ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, ఉత్తమ నటిగా రుక్మిణి వసంత్, ఉత్తమ చిత్రంగా కాంతార చిత్రాలు నిలిచాయి. ఇక మలయాళంలో ఉత్తమ నటుడిగా సర్వమ్ మాయ సినిమాకు నివిన్ పౌలీ, ఉత్తమ సినిమాగా లోకా చాప్టర్ 1, ఉత్తమ నటిగా కళ్యాణి ప్రియదర్శన్ నిలిచాయి. అలాగే ఉత్తమ దర్శకుడిగా డొమినిక్ అరుణ్ పురస్కారం అందుకోనున్నారు. హిందీలో ధురంధర్ సినిమాకు ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్, ఉత్తమ నటిగా హక్ సినిమా యామీ గౌతమ్ ధర్ నిలిచారు. ఉత్తమ చిత్రం ఛావా కాగా.. ధురంధర్ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఆదిత్య ధర్ అవార్డ్ అందుకోనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

Follow Us
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..