Naatu Naatu Song: ఆస్కార్ బరిలో నిలిచిన నాటు నాటు సాంగ్.. అవార్డుకు కూతవేటు దూరంలో..
95వ అస్కార్ అవార్డ్ నామినేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ నిలిచింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట నామినేట్ అయ్యింది.
95వ అస్కార్ అవార్డ్ నామినేషన్స్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ నిలిచింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట నామినేట్ అయ్యింది. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఆస్కార్ నామినేషన్స్‌లో నాటు నాటు సాంగ్ ఎంపికైంది. ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలిచింది. పలు భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్ లిస్ట్ కాగా.. అత్యత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాకు ఎంపిక చేశారు. కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.
అలాగే భారతీయ షార్ట్ ఫిల్మ్స్ ‘ఆల్ దట్ బ్రీత్స్’, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కూడా నామినేట్ అయ్యాయి. అలిసన్ విలియమ్స్, రిజ్ అహ్మద్ వ్యాఖ్యతలుగా ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్ జాబితాను ప్రకటించారు. ఇప్పటికే నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ అందుకుంది. ఇవే కాకుండా జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ఈ చిత్రానికి అవార్డ్ వచ్చింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం మార్చి 12న లాస్ ఏంజల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది.
This year’s Original Song nominees are music to our ears. #Oscars #Oscars95 pic.twitter.com/peKQmFD9Uh
— The Academy (@TheAcademy) January 24, 2023
Going global with this year’s nominees for International Feature Film. #Oscars #Oscars95 pic.twitter.com/naCBKbjol6
— The Academy (@TheAcademy) January 24, 2023
And the nominees for Best Picture are… #Oscars #Oscars95 pic.twitter.com/0aNqCj0Tl2
— The Academy (@TheAcademy) January 24, 2023
Lights, camera, action! Here are your nominees for Directing. #Oscars #Oscars95 pic.twitter.com/pwMEtvTygX
— The Academy (@TheAcademy) January 24, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.