Samantha: సినిమాల్లోకి రాకముందు సమంత ఎలా ఉందో చూశారా ?.. అల్లరి పిల్లగా సామ్.. పాత వీడియో..

ఇప్పటికే యశోద సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న సామ్.. ఇప్పుడు డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. అయితే కొద్ది నెలలుగా సమంత మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నారు.

Samantha: సినిమాల్లోకి రాకముందు సమంత ఎలా ఉందో చూశారా ?.. అల్లరి పిల్లగా సామ్.. పాత వీడియో..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 24, 2023 | 7:14 PM

అందం, అభినయం ఆమె సొంతం. ఏమాయే చేసావే అంటూ తెలుగు ప్రజలను మాయ చేసింది హీరోయిన్ సమంత. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా గుర్తింపు సంపాదించుకుంది. అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సామ్… పూర్తిగా కంటెంట్ ప్రాధాన్యత.. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపించింది. ఇక విడాకుల అనంతరం కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్న సామ్.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ పాటతో సామ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంతోషించారు. అలాగే బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

ఇప్పటికే యశోద సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న సామ్.. ఇప్పుడు డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. అయితే కొద్ది నెలలుగా సమంత మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సామ్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవల శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న సామ్.. ఇన్నాళ్లుగా మనసులో దాగిన సంఘర్షణను కన్నీళ్లుగా తెలిపింది. అయితే ఓవైపు కోలుకున్న సమంతను చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేయగా.. సామ్ అందం తగ్గిందంటూ ట్రోల్ చేశారు. తన గ్లామర్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేసినవారికి తనస్టైల్లో ఇచ్చిపడేసింది సామ్. ఇదిలా ఉంటే.. తాజాగా సమంత చిత్రాల్లోకి రాకముందు ఓ యాడ్ లో నటించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఆమె కెరీర్ తొలినాళ్లలో సామ్ ఓ కమర్షియల్ యాడ్ లో నటించింది. ఆషిక అనే గోల్డ్ కంపెనీకి సంబంధించిన యాడ్ అది. అప్పుడు సామ్ ఎంతో ముద్దుగా.. అల్లరి అమ్మాయిగా కనిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ సమంతలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నవయసులోనే ఇంట్లో ఆర్థిక కష్టాలు.. దీంతో చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది సామ్. ఏమాయ చేసావే సినిమా తర్వాత సామ్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే