AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘మర్యాద రామన్న’ సినిమాలోని హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఏం చేస్తోందంటే?

అందం, అభినయం, అదృష్టం.. ఈ మూడు క్వాలిటీస్‌తో సినీ ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోయిన్లు ఎందరో ఉన్నారు..

Tollywood: 'మర్యాద రామన్న' సినిమాలోని హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఏం చేస్తోందంటే?
Maryada Ramanna
Ravi Kiran
|

Updated on: Jan 24, 2023 | 7:04 PM

Share

అందం, అభినయం, అదృష్టం.. ఈ మూడు క్వాలిటీస్‌తో సినీ ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అయితే మరికొందరికి ఇవి ఉన్నా కూడా.. కొన్ని సినిమాలతోనే కనుమరుగైపోయారు. వారిలో ఒకరు సలోని అశ్వని. ‘మర్యాద రామన్న’ సినిమాతో తన నటనకు గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సలోని. తెలుగులో 10కిపైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. పెద్దగా లైమ్‌లైట్‌లోకి రాలేకపోయింది. స్టార్ హీరోలతో నటించినా కూడా ఆమెకు సరైన అవకాశాలు తలుపుతట్టలేదు. ‘ఒక ఊరిలో’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘బాస్’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్’, ‘అధినాయకుడు’, ‘రేసుగుర్రం’.. సలోని కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాలు.. ఇక 2016లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఆమె నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది.

కాగా, మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ ఉన్న సలోనిని.. ఆమె తల్లి ఎప్పుడూ ప్రోత్సహించింది. సలోనికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలు ఆఫర్లు వస్తున్నా.. ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం ఆమె ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఈ అమ్మడు పెళ్లికి కూడా దూరంగానే ఉంది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా ‘ చాలామంది నిర్మాతలు ఐటెం సాంగ్స్, హారర్ కామెడీ, సెక్స్ కామెడీ సినిమాలలో ఛాన్స్‌లతో వస్తున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉన్నా.. ఒకవేళ ఆఫర్లు రాకపోయినా కూడా నేను బ్రేక్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది పడదను’ అని ఆమె తెలిపింది.

Saloni

Saloni 1

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?