AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ సత్తా.. జక్కన్న సినిమాకు మరో అకాడమీ అవార్డ్..

అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవల అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‏ను సొంతం చేసుకున్నారు. తాజాగా మరో అవార్డ్ తన ఖాతాలో వేసుకుంది.

RRR: అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ సత్తా.. జక్కన్న సినిమాకు మరో అకాడమీ అవార్డ్..
Rrr
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2023 | 6:13 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రానికి భారతీయులే కాకుండా విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవల అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‏ను సొంతం చేసుకున్నారు. తాజాగా మరో అవార్డ్ తన ఖాతాలో వేసుకుంది. జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ఈ చిత్రానికి అవార్డ్ వచ్చింది. ఇందులో హాలీవుడ్ మూవీస్ అవతార్ ద వే ఆఫ్ వాటర్.. టాప్ గన్.. మావెరిక్ వంటి హాలీవుడ్ చిత్రాలను దాటి జక్కన్న రూపొందించిన ట్రిపుల్ ఆర్ ఈ అవార్డును కైవసం చేసుకుంది. మరోవైపు జపాన్‏లో ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ వస్తోంది. విడుదలై నెలలు కావోస్తున్న భారీగా వసూళ్లు రాబట్టింది.

మరోవైపు ఆర్ఆర్ఆర్ చిత్రం 95వ ఆస్కార్ అవార్డులో బరిలో పోటీపడుతుంది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటు నాటు పాట… మరికొన్ని విభాగాల్లో ట్రిపుల్ ఆర్ నామినేషన్ పోటీలో ఉంది. అలాగే బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ విభాగంలో గుజరాతీ ఫిల్మ్ ఛెల్లో షో.. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ దట్ బ్రీత్స్ .. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఎలిఫెట్ విష్పర్స్ ఆస్కార్ బరిలో ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం పది ఇండియన్ చిత్రాలు ఆస్కార్ రిమైండర్ జాబితాలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

దాదాపు రూ.400 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమాకు సిక్వెల్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ స్టార్ చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విదేశాల్లో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న జక్కన్న.. త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు. వీరి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

Follow Us