
ఓటీటీలో సినిమా సందడి రోజు రోజు ఎక్కువవుతున్నాయి. ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. ప్రతి శుక్రవారం తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక శుక్రవారం థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు అలరిస్తున్నాయి. ఇక హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ కంటెంట్ సినిమాలు విడుదలై మెప్పిస్తున్నాయి. కాగా ట్రెండింగ్ లో ఉన్న సినిమాల్లో ఇప్పుడు ఓ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కథ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. బాబోయ్ సీన్ సీన్ కు దిమాక్ ఖరాబ్ అవుతుంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?
ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ ఈ సినిమాలో ప్రతి సీన్ ఉత్కంఠ కలిగిస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎల్సా , క్లైవ్ అనే ఇద్దరు టాలెంటెడ్ జెనిటిక్ ఇంజనీర్లు ఉంటారు. వీరిద్దరూ న్యూ స్త్రాండ్ అనే బయోటెక్నాలజీ కంపెనీకి పనిచేస్తున్నారు. వారి లక్ష్యం వివిధ జంతువుల డీఎన్ఏలను మిక్స్ చేసి కొత్త జీవులను సృష్టించడం. వాళ్లు అప్పటికే కొన్ని విజయవంతమైన జీవాలను సృష్టిస్తారు. అయితే, వీరిద్దరూ ఇంకో అడుగు ముందుకు వేసేందుకు ప్రయత్నిస్తారు. మనుషుల డీఎన్ఏను కూడా ఈ ప్రయోగంలో కలిపి, ఒక కొత్త జీవాన్ని సృష్టించాలనుకుంటారు. ఇది సరైంది కాదని వాళ్ల కంపెనీ వీరిని నిషేధిస్తుంది. కానీ వారు రహస్యంగా ప్రయోగాన్ని కొనసాగిస్తారు.
ఈ ప్రయోగ ఫలితంగా ఒక అసాధారణ జీవం పుట్టుకొస్తుంది. దానికి వారు “డ్రెన్” అని పేరు పెడతారు. అది చాలా త్వరగా పెరిగిపోతుంది. డ్రెన్ తయారీకీ వాడిన మానవ డీఎన్ఏ ఎల్సాది అని క్లైవ్ తెలుసుకుంటాడు. ఓ క్రమంలో డ్రెన్ కి లైంగిక ఆకర్షణ పెరుగుతుంది. ఆతర్వాత వివాదాస్పద సన్నివేశానికి దారితీస్తుంది. డ్రెన్ ఆడ రూపం నుంచి మగరూపంలోకి మారిపోతుంది. ఆతర్వాత డ్రెన్ మరింత హింసాత్మకంగా మారుతుంది. అందరిని చంపుతుంటుంది. చివరిగా దాన్ని చంపేశారా.? లేక వీరే బలవుతారా అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా పేరు స్ప్లైస్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.