Kalki 2898 AD: ‘కల్కి’ ప్రభాస్ ఎంట్రీ సీన్ గూస్‏బంప్స్ అంతే..  సంగీత దర్శకుడు ఏమన్నారంటే..

పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు కల్కి ప్రాజెక్ట్ గురించి నిత్యం ఆసక్తిరక విషయాలు చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది కూడా ప్రభాస్ ఎంట్రీ సీన్ కు సంబంధించింది.

Kalki 2898 AD: 'కల్కి' ప్రభాస్ ఎంట్రీ సీన్ గూస్‏బంప్స్ అంతే..  సంగీత దర్శకుడు ఏమన్నారంటే..
Kalki 2898 AD movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 08, 2024 | 9:58 AM

మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు కల్కి ప్రాజెక్ట్ గురించి నిత్యం ఆసక్తిరక విషయాలు చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది కూడా ప్రభాస్ ఎంట్రీ సీన్ కు సంబంధించింది. దీంతో ఇప్పుడు అందరి చూపు కల్కి మూవీపైనే.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో కబాలి, కాలా, వడ చెన్నై, జగమే తంధిరమ్, దసరా చిత్రాలకు మ్యూజిక్ అందించారు సంతోష్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ప్రభాస్ ఎంట్రీ సీన్ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు తానుభారీ హై లెవల్ మ్యూజిక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. “నేను ప్రభాస్ సర్ కోసం సంగీతాన్ని ఇప్పటికే కంపోజ్ చేశాను. కానీ మళ్లీ మళ్లీ దానిపైనే వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రభాస్ మాస్ అప్పీల్ ను ప్రేక్షకులకు కనిపించాలనుకుంటున్నాను. ప్రభాస్ ఫినామినేషన్ కాబట్టి.. ఆయన కోసం చాలా స్పెషల్ గా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాను. ఆయన ఎంట్రీ సీన్ పెద్దదిగా.. భారీగా ఉంటుంది.. కాబట్టి అదే స్థాయిలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు సంతోష్ నారాయణ్ చేసిన కామెంట్స్ తో కల్కి సినిమాపై మరింత హైప్ ఏర్పడింది.

‘ప్రభాస్ అంటే చాలా స్పెషల్. అందుకే ఈ మూవీలో ఆయన ఇంట్రో సీన్ కోసం చాలా స్పెషల్ గా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాను. ఇంట్రో వర్క్ పెద్దగా, మాస్ గా ఉండాలి’ అని అన్నారు. ఈ మూవీ మే 9న థియేటర్లలో విడుదల కానుంది. సినీ ప్రియులకు ఈ మూవీ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని.. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. కల్కి కాకుండా.. రాజాసాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.