Surya s/o Krishnan: మళ్లీ రాబోతున్న సూర్య సూపర్ హిట్ మూవీ.. ‘సూర్య s/o కృష్ణన్’ రీరిలీజ్..
కోలీవుడ్ స్టా్ర్ హీరో సూర్య కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ 'సూర్య s/o కృష్ణన్' . డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమీరా రెడ్డి, దివ్య స్పందన, సిమ్రాన్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో సూర్య తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. 2008లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పట్లోనే ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈసినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది.
ప్రస్తుతం థియేటర్లలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రీరిలీజ్ అయ్యింది. దీంతో ఇప్పుడు సూర్య సూపర్ హిట్ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. కోలీవుడ్ స్టా్ర్ హీరో సూర్య కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ‘సూర్య s/o కృష్ణన్’ . డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమీరా రెడ్డి, దివ్య స్పందన, సిమ్రాన్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో సూర్య తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. 2008లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పట్లోనే ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈసినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది.
గతేడాది ఆగస్టులో రీరిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో సూర్య అభిమానులు చేసిన హడావిడి గురించి చెప్పక్కర్లేదు. సూర్య, గౌతమ్ వాసుదేవ్ మీనన్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయ్యిందంటూ సంతోషం వ్యక్తం చేశారు ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు ఎగబడ్డారు జనాలు.. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో వాలెంటైన్స్ డే రోజున అంటే ఫిబ్రవరి 14న మళ్లీ తెలుగులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
ఈ చిత్రానికి హరీష్ జై రాజ్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికీ ఈసినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో సూర్య, సమీరారెడ్డి కెమిస్ట్రీ మేజర్ హైలెట్. వీరిద్దరి కాంబోలో వచ్చే పాటలు మ్యూజిక్ లవర్స్ ను కట్టిపడేస్తాయి. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ రొమాంటిక్ చిత్రాలు తెరకెక్కించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్.. తనకు మాత్రం సూర్య సన్నాఫ్ కృష్ణన్ చాలా ఇష్టమని గతంలో పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ప్రేమికుల దినోత్సం సందర్భంగా ఈ సినిమాను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.