Isaac Thomas Kottukapally : సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు కన్నుమూత..

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు ఇస్సాక్ థామస్ కొట్టుకపల్లి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు...

Isaac Thomas Kottukapally : సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు కన్నుమూత..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 19, 2021 | 11:47 AM

Isaac Thomas Kottukapally: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు ఇస్సాక్ థామస్ కొట్టుకపల్లి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు. కొడైకెనాల్‌లోని అమెరికన్ టీచర్స్ స్కూల్ నుండి సంగీత కోర్సు పూర్తి చేసిన తరువాత, లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో పియానోలో సిక్త్‌ గ్రేడ్‌ సాధించారు థామస్. మన్ను ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన థామస్‌ మలయాళంతో పాటు హిందీ, కన్నడ, తమిళ చిత్రాలకు సంగీతం అందించారు.

సినీ పరిశ్రమలోని వివిధ రంగాలల్లో సేవలు అందించిన థామ‌స్ జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. భావం, మార్గం , సంచరం అండ్‌ ఒరిడామ్ అనే నాలుగు చిత్రాలకు గాను ఉత్తమ నేపథ్య సంగీతానికి స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. థామ‌స్ మృతిపై సినీ ఇండ‌స్ట్రీకు సంబంధించిన ప‌లువ‌రు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. థామ‌స్ మృతిపై కేరళ సాంస్కృతిక మంత్రి ఎకె బాలన్ సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు తీరనిది అంటూ మంత్రి ఎకె బాలన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘Pogaru’ Movie Review : మాస్ ఆడియన్స్ ఆకలి తీర్చే యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘పొగరు’..