AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu-Rehman: సానియా ఫెర్‏వెల్ పార్టీలో మహేష్ దంపతుల సందడి.. ప్రిన్స్‏తో సెల్ఫీ తీసుకున్న రెహమాన్..

సానియాతో దిగిన ఓ ఫోటోను మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ "ఇన్నాళ్ల నీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సానియా ఫెర్ వెల్ పార్టీకి సంబంధించిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Mahesh Babu-Rehman: సానియా ఫెర్‏వెల్ పార్టీలో మహేష్ దంపతుల సందడి.. ప్రిన్స్‏తో సెల్ఫీ తీసుకున్న రెహమాన్..
Mahesh Babu, Ar Rahman
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2023 | 12:43 PM

Share

భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంతర్జాతీయ టెన్నిస్‏కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మార్చి 5న హైదరాబాద్‏లోని లాల్ బహదూర్ స్టేడియంలో సానియా గ్రాండ్‏గా ఫెర్ వెల్ పార్టీ అరెంజ్ చేసింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇద్దరూ బ్లాక్ అవుట్ ఫిట్‏లో మరింత స్టైలీష్‏గా కనిపించారు. ఇక ఈ సానియాతో దిగిన ఓ ఫోటోను మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “ఇన్నాళ్ల నీ ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సానియా ఫెర్ వెల్ పార్టీకి సంబంధించిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ కార్యక్రమంలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సైతం పాల్గొన్నారు. అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రెహమాన్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ హ్యాపీగా ఫీలయ్యారు రెహమాన్. ఆ ఫోటోలో రెహమాన్ తోపాటు.. మహేష్ కూడా చిరునవ్వు చిందిస్తూ కనిపించారు.

ఇవి కూడా చదవండి

ఇక రెహమాన్ ట్వీట్‏ను రీట్వీట్ చేశారు మహేష్. ఈ ఫోటోను లెజెండ్ స్వయంగా క్లిక్ చేశారు. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది సార్. అంటూ రాసుకొచ్చారు మహేష్. ఇందుకు రెహమాన్ స్పందిస్తూ.. మహేష్ గారూ మీతో లవ్లీ క్యాచింగ్ అఫ్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉంటే సానియా మీర్జా కుటుంబంతో మహేష్ బాబు, నమ్రతకు మంచి అనుబంధం ఉంది. గతంలోనూ పలు ఫ్యామిలీ వేడుకలలో వీళ్లు సందడి చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!