Tollywood: ఇండస్ట్రీలో నయా ట్రెండ్.. హీరోయిన్స్ పంట పండిస్తున్న నిర్మాతలు..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తోంది. ఒకే హీరోయిన్‌కి రెండు మూడు ఆఫర్లు ఇస్తున్నారు నిర్మాతలు. ఏంటి నమ్మరా.. ఒక్కరో ఇద్దరో అయితే కాకతాళీయం అనుకోవచ్చు. ప్రతీ హీరోయిన్‌కు ఇదే జరుగుతుంటే ఎందుకు నమ్మరు..? ఓ ప్రొడక్షన్ హౌజ్‌లోకి ఎవరైనా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే కనీసం రెండు మూడు సినిమాలకు సైన్ చేయిస్తున్నారు నిర్మాతలు.

ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ సమయంలో ఒక్క ఛాన్స్ రావడమే కష్టంగా మారుతోంది. అలాంటిది.. ఒకేసారి రెండు మూడు ఆఫర్స్.. అందులోనూ ఒకే నిర్మాణ సంస్థ నుంచి వస్తే అంతకంటే కావాల్సింది ఇంకేం ఉంటుంది చెప్పండి..? ఇప్పుడు కొందరు హీరోయిన్లకు ఇదే జరుగుతోంది. ముఖ్యంగా నిర్మాతలే పిలిచి మరీ ఛాన్స్ ఇస్తున్నారు. రండి బాబూ రండి.. ఆలోచించిన ఆశాభంగం.. ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ డిస్కౌంట్ మేళా నడుస్తుందిప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఏంటి నమ్మరా.. ఒక్కరో ఇద్దరో అయితే కాకతాళీయం అనుకోవచ్చు. ప్రతీ హీరోయిన్‌కు ఇదే జరుగుతుంటే ఎందుకు నమ్మరు..? ఈ 1+1 ఆఫర్ చాలా మందికి అప్లై అవుతుంది. ఓ ప్రొడక్షన్ హౌజ్‌లోకి ఎవరైనా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే కనీసం రెండు మూడు సినిమాలకు సైన్ చేయిస్తున్నారు నిర్మాతలు.
రెండేళ్ళ కింద ఆదికేశవలో నటిస్తున్నపుడే శ్రీలీలకు గుంటూరు కారంలో ఆఫర్ ఇచ్చారు సితార ఎంటర్‌టైన్మెంట్స్. ఆ తర్వాత మీనాక్షి చౌదరికి గుంటూరు కారంలో ఛాన్స్ ఇచ్చాక.. అదే సితారలో లక్కీ భాస్కర్ సినిమా చేసింది. అలాగే వరుణ్ తేజ్‌తో మట్కా సినిమాను నిర్మించిన SRT ఎంటర్‌టైన్మెంట్స్.. విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ నిర్మించారు. ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ మీనాక్షి చౌదరీనే. ఇక సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన డిజే టిల్లులో నేహా శెట్టి నటిస్తే.. అదే బ్యానర్‌లో విశ్వక్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ ఈమె హీరోయిన్‌గా నటించింది. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వరసగా కార్తికేయ 2, ఈగల్ సినిమాలు చేసింది అనుపమ పరమేశ్వరన్.
సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో టిల్లు స్క్వేర్ కంటే ముందే.. అ..ఆ, ప్రేమమ్ సినిమాలు చేసింది అనుపమ పరమేశ్వరన్. అలాగే సరిలేరు నీకెవ్వరు తర్వాత రష్మిక మందనను వారసుడులోనూ రిపీట్ చేసాడు దిల్ రాజు. మైత్రి మూవీ మేకర్స్‌లోనూ డియర్ కామ్రేడ్ తర్వాత పుష్ప ఫ్రాంచైజీలో నటించారు ఈ భామ. ఇక సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో వరసగా భీమ్లా నాయక్, సార్ సినిమాలు చేసింది సంయుక్త మీనన్. డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌లోనూ హీరోయిన్స్ రిపీట్ అవుతున్నారు. భరత్ అనే నేను, వినయ విధేయ రామలో కియారా అద్వానీ నటిస్తే.. సరిపోదా శనివారం తర్వాత ఓజిలోనూ ప్రియాంక మోహన్ నటిస్తుంది. వైష్ణవి చైతన్య కూడా బేబీ తర్వాత అదే బ్యానర్‌లో మరో సినిమా చేస్తుంది. ఏదేమైనా ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మళ్లీ మళ్లీ అదే ప్రొడక్షన్ హౌజ్ నుంచి అవకాశాలు అందుకుంటున్నారు హీరోయిన్లు.




