Mrunal Thakur: ఆ విషయం చెప్పగానే గుండె బద్ధలైంది.. బయటపడేందుకు చాలా టైమ్ పట్టింది.. మృణాల్ ఠాకూర్..
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. హిందీలో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు అసలైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం సీతారామం సినిమానే. టాలీవుడ్ డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సీతామహాలక్ష్మి పాత్రలో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకుంది మృణాల్. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

బుల్లితెరపై సీరియల్స్‌లో సహాయ నటిగా కెరీర్ ఆరంభించిన అమ్మాయి ఇప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే నటిగా గుర్తింపు కోసం సినీరంగంలో అడుగుపెట్టిన ఆమె.. ఎన్నో అడ్డంకులు, అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తనే బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. హిందీలో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు అసలైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం సీతారామం సినిమానే. టాలీవుడ్ డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సీతామహాలక్ష్మి పాత్రలో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకుంది మృణాల్. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. సీతారామం తర్వాత తెలుగులో మృణాల్ కు అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే ఇప్పటికీ ఆమెను సీతారామం బ్యూటీ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్. ఇక తనకు ఇష్టమైన సినిమా సీతారామం అని.. సీతామహాలక్ష్మి పాత్ర తన కెరీర్ లోనే అత్యంత గొప్ప రోల్ అంటుంది మృణాల్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. “తెలుగులో నేను చేసిన మొదటి సినిమా సీతారామం. ఆ సమయంలో నాకు ఏమి చేయాలో తెలియదు. ఇప్పుడే నాకు దుల్కర్ సల్మాన్ ఎంతో సహకారం అందించాడు. ఎప్పటికీ అతడే నా మార్గదర్శి. సీతామహాలక్ష్మి పాత్ర నుంచి ముందుకు వెళ్లడం చాలా కష్టంగా అనిపించింది. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలియగానే గుండె బద్దలైనట్లు అనిపించిచంది. పాత్రను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా మారిపోతా. అలా నటించిందే సీతామహాలక్ష్మి. ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. ఎంతో కష్టంగా అనిపించింది. షూటింగ్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లినప్పుడు గుండె భారంగా అనిపించింది. ఆ పాత్రలను నేను ఎంతో ప్రేమించాను. వాటిని తిరిగి ఎప్పటికీ చేయలేనేమో. ఇది నిజంగా హార్ట్ బ్రేక్ ” అని అన్నారు.
అలాగే తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ “నన్ను రిజెక్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికీ ఇంకా నేను సరిపోనని గ్రహించాను. అందుకే రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు నాపై నమ్మకం వచ్చింది. అప్పట్లో ఈ ఆత్మవిశ్వాసం నాలో లేదు” అని అన్నారు. సీతారామం తర్వాత తెలుగులో హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇక ఇటీవలే విజయ్ దేవరకొండ జోడిగా ఫ్యామిలీ స్టార్ మూవీలో కనిపించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




