Manchu Lakshmi: ముంబైలోని హోంటూర్ వీడియో షేర్ చేసిన మంచు లక్ష్మి.. ఎంత అందంగా ఉందో చూశారా ?..
ఇప్పుడు ఆమె ముంబైకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. అక్కడే సొంతంగా ఓ ఫ్లాట్ తీసుకుంది. అయితే అది పర్మనెంట్ ఫ్లాట్ కాదని కూడా తెలిపింది. ఆ ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ పలు విషయాలను పంచుకుంది. ఆ ఇల్లు పర్మనెంట్ కాకపోవడంతో కొత్తగా వస్తువులు కొనలేదని.. తనకు నచ్చిన కావాల్సిన వస్తువులను హైదరాబాద్ నుంచి తెచ్చి పెట్టుకున్నానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి షేర్ చేసిన హోంటూర్ వీడియో నెట్టింట వైరలవుతుంది.

టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు మంచు లక్ష్మి. నటిగా..నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. కేవలం సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఫోటోస్, ఫ్యామిలీ వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఆమె ముంబైకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. అక్కడే సొంతంగా ఓ ఫ్లాట్ తీసుకుంది. అయితే అది పర్మనెంట్ ఫ్లాట్ కాదని కూడా తెలిపింది. ఆ ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ పలు విషయాలను పంచుకుంది. ఆ ఇల్లు పర్మనెంట్ కాకపోవడంతో కొత్తగా వస్తువులు కొనలేదని.. తనకు నచ్చిన కావాల్సిన వస్తువులను హైదరాబాద్ నుంచి తెచ్చి పెట్టుకున్నానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి షేర్ చేసిన హోంటూర్ వీడియో నెట్టింట వైరలవుతుంది.
హైదరాబాద్ ఇంటి నుంచి డైనింగ్ టేబుల్ తెచ్చి ముంబై ఇంట్లో పెట్టేసింది. అలాగే ముంబైలో చాలా ఇళ్లు చూశానని… ఆ దేవుడే తనను ఈ ఇంటికి తీసుకొచ్చాడని తెలిపింది. అదే ఇంటిలో ఉన్న ఆర్ట్ వర్క్ చూపించడమే కాకుండా హైదరాబాద్ ఇంటి నుంచి తెచ్చిన వస్తువులను చూపిస్తూ హోంటూర్ చేసింది. ముంబైలోని ఆ ఇళ్లు ఎంతో విలాసవంతంగా.. చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పటికే తాను షేర్ చేసిన హోంటూర్ వీడియోలకు మంచి రెస్పా్న్స్ వచ్చిందని.. అందుకే ఇప్పుడు ఇలా ముంబై ఇంటిని కూడా చూపిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
చాలారోజులుగా మంచు లక్ష్మి తెలుగు సినిమాల్లో కనిపించడంలేదు. అలాగే కొత్తగా ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. కానీ కొన్ని రోజులుగా ముంబై వెళ్లి వస్తుంది. షూటింగ్స్ కోసం క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇక ఇలా సినిమాల కోసం అటు ఇటు వెళ్లి వస్తుండడంతో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అక్కడే హోం తీసుకుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా ఆదిపర్వం. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




