Mruanl Thakur: టాలీవుడ్లో సీతకు పెరుగుతున్న క్రేజ్.. మరోసారి సీతారామం జోడీ రిపీట్ ?.. డైరెక్టర్ ఎవరంటే..
ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో కనిపించగా.. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రలలో కనిపించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం.

సీతారామం (Sita Ramam) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. సీతా మహాలక్ష్మీ పాత్రలో జీవించేసింది. ఆమె నటనకు.. లుక్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో కనిపించగా.. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రలలో కనిపించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. ఇక ఇప్పుడు తెలుగులో మృణాల్ కు వరుస ఆఫర్లు తలుపు తట్టినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్నాదత్ బ్యానర్లో రాబోయే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో మృణాల్ కనిపించనుందట. ఈ చిత్రానికి డైరెక్టర్ బివి నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారట. అయితే ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా మారనున్నట్లుగా సమాచారం. గతంలో సమంత నటించిన ఓబేబీ వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన నందిని రెడ్డి దర్శకత్వంలో మృణాల్, హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి కలిసి నటించనున్నారట. దీంతో మరోసారి సీతారామం జోడీ రిపీట్ కాబోతుండడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగులో సెన్సెషన్ క్రియేట్ చేసిన సీతారామం సినిమా ఇప్పుడు హిందీలో విడుదల కాబోతుంది. సెప్టెంబర్ 2న నార్త్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇదే కాకుండా.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో రాబోతున్న ప్రాజెక్టులో మృణాల్ కథానాయికగా ఎంపికైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.