Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ ప్రామిస్.. నన్ను నమ్మండి అంటూ రిక్వెస్ట్..
ఈ క్రమంలోనే పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే ప్రామిస్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయన దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భవదీయుడు భగత్ సింగ్. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది.
భీమ్లా నాయక్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ..అవన్నీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక గత కొద్ది రోజులుగా ఆయన చిత్రాలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ రాలేదు. కొన్నిరోజులుగా మేకర్స్ సైతం సైలెంట్ అయిపోయారు. ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ.. మరోవైపు షూటింగ్స్‌లో పాల్గోంటూ తన సినిమాలు తొందరగా కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు పవన్. మరికొద్ది రోజుల్లో పవర్ స్టార్ పుట్టిన రోజు రాబోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ పవన్ బర్త్ డే సెలబ్రెషన్స్ షూరు చేశారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే ప్రామిస్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయన దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భవదీయుడు భగత్ సింగ్. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది.
ఆ స్టెప్స్, ఆ స్టైల్, ఆ స్వాగు ఏమైపోయాయి కళ్యాణ్ అన్నా. హరీష్ అన్న మళ్లీ నీ వల్లే అవుతుంది ఇలాంటివి. నీ సినిమాతో లాస్ట్ అనిపిస్తుంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అతడి ట్వీట్‌కు హరీష్ శంకర్ రిప్లై ఇస్తూ.. అన్ని ఉంటాయ్. ఏది మిస్ అవ్వదు. నన్ను నమ్మండి. మీ ఎదురుచూపులకు తగిన ఫలితం ఉంటుంది అంటూ రాసుకొచ్చారు. హరీష్ శంకర్ ట్వీట్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. ఇక పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తమ్ముడు చిత్రాన్ని మరోసారి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే జల్సా సినిమాను కూడూ విడుదల చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ట్వీట్..
Anni untaay…. Edhi miss avvadhu …trust me its worth waiting for u and me ?? https://t.co/8uo7ObiDOE
— Harish Shankar .S (@harish2you) August 27, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.