Salaar Movie: ప్రభాస్ అభిమానులకు ‘సలార్’ టీమ్ స్పెషల్ రిక్వెస్ట్.. ఆ వార్తలను అస్సలు నమ్మకండి అంటూ..

ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా..హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సలార్ వాయిదా అంటూ ఫిల్మ్ సర్కిల్లో రూమర్స్ చక్కర్లు కొట్టాయి..

Salaar Movie: ప్రభాస్ అభిమానులకు 'సలార్' టీమ్ స్పెషల్ రిక్వెస్ట్.. ఆ వార్తలను అస్సలు నమ్మకండి అంటూ..
Salaar
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 3:47 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్ని ఇప్పుడు సలార్ చిత్రంపైనే ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పటికే సెట్ నుంచి విడుదల చేసిన ఫోటోస్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా..హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సలార్ వాయిదా అంటూ ఫిల్మ్ సర్కిల్లో రూమర్స్ చక్కర్లు కొట్టాయి.. తాజాగా వీటిపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. సినిమా వాయిదా అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది.

“ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ పై వస్తున్న పుకార్లను నమ్మవద్దు. షూటింగ్ ఆలస్యంగా జరుగుతుందని రిలీజ్ వాయిదా పడుతుందని రూమర్స్ వస్తున్నాయి. అందులో ఎటువంటి నిజం లేదు. మా మీద విశ్వాసం ఉంచండి. విడుదల తేదీ మారదు. మరపురాని సినిమా అనుభవం కోసం మీరు సిద్ధంగా ఉండండి. వరల్డ్ వైడ్‏గా సెప్టెంబర్ 28, 2023నే రిలీజ్ కాబోతుంది” అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమానే కాకుండా.. ప్రభాస్ చేతిలో మరో రెండు మూడు సినిమాలున్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె, మారుతి దర్శకత్వంలో మరో సినిమా. షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.