ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. నాలుగు చిన్న సినిమాలు తీయొచ్చు గురూ..!

మినిమమ్ 150కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా ఏకంగా 1000కోట్లతో తెరకెక్కుతుంది అన్న రూమర్ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఓ వెబ్ సిరీస్ కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిందట.. భారీ బడ్జెట్ అంటే అంతా ఇంతా కాదు.. ఏకంగా రాజమౌళి సినిమాలనే బీట్ చేసే రేంజ్ లో తెరకెక్కిందట.

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. నాలుగు చిన్న సినిమాలు తీయొచ్చు గురూ..!
Heeramandi
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 08, 2024 | 1:38 PM

ఈ మధ్య కాలంలో సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది. చిన్న సినిమాలు కూడా బడ్జెట్ పెంచే తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. ఇక పెద్ద సినిమా సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మినిమమ్ 150కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా ఏకంగా 1000కోట్లతో తెరకెక్కుతుంది అన్న రూమర్ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఓ వెబ్ సిరీస్ కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిందట.. భారీ బడ్జెట్ అంటే అంతా ఇంతా కాదు.. ఏకంగా రాజమౌళి సినిమాలనే బీట్ చేసే రేంజ్ లో తెరకెక్కిందట. ఇంతకు ఆ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఎదో తెలుసా..?

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అటు యంగ్ హీరోలు కూడా వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలే అక్కినేని యంగ్ హీరో నాగ చైత్యన దూత వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే తమన్నా, కాజల్, హన్సిక ఇలా చాలా మంది హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లలో నటించారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్  సంజయ్ లీలా భన్సాలీ కూడా హిందీలో ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు హీరామండి అనే టైటిల్ ను ఖరారు చేశారు.. ఈ వెబ్ సిరీస్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. దాంతో ఇది ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సిరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. మామూలుగానే ఆయన సినిమాలు చాలా గ్రాండ్ గా ఉంటాయి. ఇక ఈ వెబ్ సిరీస్ ను కూడా అంతే గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట ఈ లెజెండ్రీ డైరెక్టర్. దాదాపు 200కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఇది తెరకెక్కుతోంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1 సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ తో వస్తుంది ఈ వెబ్ సిరీస్.  ఈ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే అజయ్ దేవగన్ నటించిన రుద్ర 200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇప్పుడు హీరమండి 200కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

సంజయ్ లీల బన్సాలి ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.