Mohanlal: స్పీడ్ పెంచిన సీనియర్ హీరో.. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న మోహన్ లాల్
ఒకటీ, రెండూ కాదు, మోహన్‌లాల్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తన్న చాలా విషయాలు ఈ ఏడాది మెటీరియలైజ్ కానున్నాయన్నది అక్కడి నుంచి వినిపిస్తున్న మాట.

మోహన్‌లాల్‌కి 2023 అసలు మరపురాని ఏడాదిగా మారబోతోందని అంటున్నారు మాలీవుడ్ ప్రముఖులు. ఒకటీ, రెండూ కాదు, మోహన్‌లాల్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తన్న చాలా విషయాలు ఈ ఏడాది మెటీరియలైజ్ కానున్నాయన్నది అక్కడి నుంచి వినిపిస్తున్న మాట. ఇంతకీ ఏంటవి ? మోహన్‌లాల్ పేరు చెప్పగానే తెలుగువారందరికీ తారక్‌తో నటించిన జనతా గ్యారేజ్ గుర్తుకొస్తుంది. కోవిడ్ టైమ్‌లో మలయాళం సినిమాలు మళ్లీ మళ్లీ చూసిన వారికి మాత్రం లూసిఫర్ గుర్తుకొస్తుంది. ఆ సినిమాకు అంతటి క్రేజ్ వచ్చింది కాబట్టే ఇప్పుడు లూసిఫర్ పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందన్నది పృథ్విరాజ్ మాట.
లూసిఫర్‌కన్నా ముందు అలోన్ సినిమా విడుదలవుతుంది. ఆశీర్వాద్ సినిమా తెరకెక్కిస్తున్న అలోన్ లో వింటేజ్ మోహన్‌లాల్ కనిపిస్తారన్నది మాలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూసిన వాళ్లు రియల్ హీరోస్ ఆర్ ఆల్వేస్ అలోన్ అని అంటున్నారు.
మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బారోజ్. ఆయన ఎంతో ఇష్టపడి డైరక్ట్ చేస్తున్న సబ్జెక్ట్ ఇది. ఏడాది క్రితం అఫిషియల్ ప్రోమో టీజర్‌ని రిలీజ్ చేశారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తికావచ్చింది. దృశ్యం డైరక్టర్‌తోనే మరో సినిమా చర్చల్లో ఉంది. ఇది కాకుండా త్రిష హీరోయిన్‌గా రామ్ సినిమా సెట్స్ మీద ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది రామ్. ఈ సినిమా దృశ్యం తరహాలో ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి.




