MAA Elections Counting: పోలింగ్ కేంద్రం వద్ద నరాలు తెగే ఉత్కంఠ.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుడికి మోహన్ బాబు వార్నింగ్

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Oct 10, 2021 | 6:48 PM

యుద్ధం ముగిసింది. నువ్వానేనా చూసుకుందాం రా అంటూ సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. 

MAA Elections Counting: పోలింగ్ కేంద్రం వద్ద నరాలు తెగే ఉత్కంఠ.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుడికి మోహన్ బాబు వార్నింగ్
Mohan Babu Warning

Follow us on

యుద్ధం ముగిసింది. నువ్వానేనా చూసుకుందాం రా అంటూ సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది.  నరాల తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మంచు విష్ణు ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ఇంతకుముందెన్నడూ ఓటేయనివాళ్లు కూడా వచ్చి ఓటేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఫ్లైట్స్‌లో వచ్చిమరీ ఓటేసి వెళ్లారు. దీంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కౌంటింగ్ కేంద్రంలో అందరూ టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు. కాగా కౌంటింగ్ కేంద్రంలో ఉన్న మోహన్ బాబు ప్రకాశ్ రాజ్ ప్యానల్ మెంబర్ రమణా రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతే వెంటనే మంచు విష్ణు రమణా రెడ్డిని సముదాయించి కూర్చోబెట్టారు. దీంతో రమణా రెడ్డి సైలెంట్ అయిపోయారు.

ఎంతమంది పోటీపడినా చివరికి గెలిచేది మాత్రం ఒక్కరే. కానీ, రెండు ప్యానెళ్లూ గెలుపు ధీమాగా ఉన్నారు. అందుకే, ఇరువర్గాలు కూడా పూల దండలతో సంబరాలకు సిద్ధంగా ఉన్నారు. గెలిచేది ఎవరైనా సెలబ్రేషన్స్ మాత్రం ఒక రేంజ్‌లో ఉండబోతున్నాయ్.

Also Read :  హేమ కోరకడంతో శివబాలాజీకి గాయం.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu