Tollywood : టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్ నటుడు.. ఈయన ఎవరో గూర్తుపట్టరా.? చాలా ఫెమస్

ఇప్పటికే తమిళ్, మలయాళ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. అలాగే కొంతమంది హీరోలు విలన్స్ గా మారి మన సినిమాల్లో కనిపిస్తున్నారు. తాజాగా మరో నటుడు కూడా ఇప్పుడు విలన్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు.

Tollywood : టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్ నటుడు.. ఈయన ఎవరో గూర్తుపట్టరా.? చాలా ఫెమస్
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 03, 2024 | 10:20 AM

టాలీవుడ్ సినిమా స్థాయి పెరిగిపోయింది. ఇతరభాషల నుంచి కూడా హీరో, హీరోయిన్స్ మన దగ్గర సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే తమిళ్, మలయాళ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. అలాగే కొంతమంది హీరోలు విలన్స్ గా మారి మన సినిమాల్లో కనిపిస్తున్నారు. తాజాగా మరో నటుడు కూడా ఇప్పుడు విలన్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ గా ఆదిపురుష్, దేవర సినిమాల్లో విలన్ గా చేసి మెప్పించిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఇప్పుడు మరో నటుడు విలన్ అవతారం ఎత్తాడు. ఇంతకూ పై ఫొటోలో కనిపిస్తున్న నటుడు ఎవరో గుర్తుపట్టారా.?

అతను మరెవరో దివ్యేందు శర్మ. ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’లో నటుడు దివ్యేందు శర్మ మున్నా భయ్యా పాత్రను పోషించారు. అతని ఈ పాత్ర చాలా ఫేమస్ అయింది. ప్రస్తుతం అతను మున్నా భయ్యా పాత్రతో బాగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన అభిమానులకు ఓ పెద్ద వార్త వచ్చింది. టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలో భాగం కాబోతున్నాడు ఈ మున్నా భయ్యా.

దివ్యేందు అనేక హిందీ భాషా చిత్రాల్లో నటించాడు. ఇక ఇప్పుడు ఈ యంగ్ టాలెంట్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఓ పెద్ద సినిమాలో అడుగుపెట్టాడు. ఆ సినిమా ఎదో కాదు. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘RC16’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కనిపించబోతోంది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని గతంలో రామ్ చరణ్ హింట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. త్వరలోనే ఈ సినిమా పై క్రేజీ అప్డేట్స్ రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.