బాలయ్య సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకున్న హాట్ బ్యూటీ

26  December 2024

Rajeev 

శ్రద్ధ శ్రీనాథ్.. ఈ అమ్మడు జెర్సీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

జెర్సీ సినిమా మంచి విజయం సాధించడంతో శ్రద్ధ శ్రీనాథ్ కు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.

కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమాతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లోనూ నటించి అలరించింది. 

తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు 

రీసెంట్ గానే ఈ చిన్నది మెకానిక్ రాకీ సినిమాలో నటించింది ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 

ఇక ఇప్పుడు బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ సినిమాలోనూ అవకాశం అందుకుంది. 

అయితే ఈ సినిమా పై శ్రద్దా బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.