డబ్ స్మాష్ వీడియోలు చేసే చిన్నది .. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బ్యూటీ

26  December 2024

Rajeev 

చాలా మంది హీరోయిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారానే పాపులర్ హీరోయిన్స్ అయినవారు కూడా ఉన్నారు. 

ఈ అమ్మడు కూడా అంతే.. సోషల్ మీడియా ద్వారా సినిమాల్లో అవకాశం అందుకుంది. డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలు చేసి పాపులర్ అయ్యింది. 

అక్కడ వచ్చిన క్రేజ్ తోనే సినిమాల్లో అవకాశం అందుకుంది. ఇక ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారి దూసుకుపోతుంది. 

ఆమె ఎవరో కాదు కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాళిని రవి. ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది.

మృణాళిని రవి తెలుగు ఆడియెన్స్ కు కూడా సుపరిచితమే. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది ఈ బ్యూటీ. 

 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. 

ఇప్పుడు కోలీవుడ్ లో రాణిస్తుంది. అలాగే అందాలతోనూ ప్రేక్షకులను కవ్విస్తుంది. నెట్టింట క్రేజీ పిక్స్ షేర్ చేస్తుంది.