Thalapathy Vijay: తీవ్ర నిరాశలో దళపతి ఫ్యాన్స్.! సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్ కొడుకు
దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్.. కథానాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారని ప్రచారం కూడ జరిగింది. అయితే ఈ న్యూస్‌కు భిన్నంగా.. విజయ్ కొడుకు జేసన్ .. కోలీవుడ్‌లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను చేసేశాడు. అయితే విజయ్ తనయుడు హీరోగా కాకుండా.. డైరెక్టర్‌గా.. కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండడం పై అభిమానులు ఫీలవుతున్నారు. నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
ఇక విజయ్ కొడుకు జేసన్ తొలి సినిమాలో హీరోగా టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక తాజాగా ఈసినిమా నుంచి టీజర్ కూడా రిలీజైంది. టీజర్‌లో పురాతన వస్తువులు, డబ్బు కట్టలు కనిపిస్తున్నాయి. థ్రిల్లర్ కథాంశంతో సినిమా ఉంటుందని టీజర్ ను బట్టి తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించారు. ఇప్పుడు తన 69వ చిత్రంలో నటిస్తున్నారు. ఇదే అతని చివరి చిత్రం. విజయ్ కొడుకు సినిమా పరిశ్రమలో తన తండ్రి స్థానాన్ని తీసుకుంటున్నాడని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జేసన్ దర్శకత్వం వైపు మొగ్గు చూపడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక గతంలో, జేసన్ తన తండ్రి విజయ్ దళపతి నటించిన కొన్ని చిత్రాలలో కనిపించాడు. పాటల్లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.