Naga Chaitanya-Sobhita: కొత్త కోడలికి మామగారి గిఫ్ట్.. రూ.2 కోట్ల కారు.! అక్కినేని వారింట పండగ..

Naga Chaitanya-Sobhita: కొత్త కోడలికి మామగారి గిఫ్ట్.. రూ.2 కోట్ల కారు.! అక్కినేని వారింట పండగ..

Anil kumar poka

|

Updated on: Dec 03, 2024 | 10:28 AM

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్లి వేడుకల్లో భాగంగా నవంబర్ 29న ఇరు కుటుంబాల ఇంట్లో హల్దీ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. వధూవరులిద్దరికీ మంగళ స్నానాలు చేయించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ వేడుకల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. అదే సమయంలో కాబోయే కోడలికి అక్కినేని కుటుంబీకులు ఇవ్వబోయే కానుకలు, బహుమతుల గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

నాగార్జున ఇటీవల టయోటా లెక్సస్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. నాగ చైతన్య పెళ్లి కోసమే సుమారు 2కోట్లు పెట్టి ఈ కారు కొన్నాడని తెలిసింది. అయితే ఇది శోభితకు బహుమతిగా ఇవ్వడం కోసమే కొన్నారని తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాలను కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ కానుకలుగా ఇవ్వనుంది.

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి నాగార్జున కారుతో వచ్చాడు. కారు రిజిస్టర్ చేసుకున్న అనంతరం అభిమానులతో ఫోటోలు దిగాడు. నాగార్జున కొనుగోలు చేసిన కొత్త కారు ధర దాదాపు రెండున్నర కోట్ల రూపాయలని అంటున్నారు. రణబీర్ కపూర్ కూడా ఇంతకు ముందు ఈ కారును కొన్నాడు. ఈ కారు సెలబ్రిటీలకు ఇష్టమైన కారు. ఇప్పుడిదే లగ్జరీ కారును శోభితకు కానుకగా నాగ్ ఇవ్వనున్నారని సమాచారం. వీటిపై అటు నాగార్జున, ఇటు శోభిత కుటుంబీకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు కాబోయే అల్లుడికి శోభిత తల్లిదండ్రులు భారీగానే కానుకలు ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది. నాగచైతన్యకు ఒక ఆడీ కారుతో పాటు స్పోర్ట్స్‌ బైక్‌ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా హైదరాబాద్‌లోనే ఓ లగ్జరీ విల్లాను కూడా ఇవ్వనున్నారట. అయితే అక్కినేని కుటుంబం.. తమకు ఎలాంటి డబ్బు, నగలు అవసరం లేదని, తమ కొడుకుకి భార్యగా, చక్కటి ఇల్లాలుగా, జీవితాంతం తోడునీడుగా ఉంటే చాలని శోభిత కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.