Talasani Srinivas Yadav: థియేటర్లు మూసివేయడం లేదు.. ప్రచారాలను నమ్మొద్దు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..
ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా థియేటర్లు మూసివేస్తామనే వార్తలు అవాస్తవమని తెలంగాణ సినిమాట్రోగ్రఫీ
ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా థియేటర్లు మూసివేస్తామనే వార్తలు అవాస్తవమని తెలంగాణ సినిమాట్రోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈరోజు టాలీవుడ్ సినీ ప్రముఖులు దిల్ రాజు, ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్, నిర్మాత దానయ్య… ఇతర సినీ ప్రముఖులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటి అయ్యారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా రెండేళ్లుగా సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ వస్తుందని ప్రచారం జరుగుతోందని.. ఆ ప్రచారాలను నమ్మకండి. ఆర్ఆర్ఆర్.. పుష్ప సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. సినీ పరిశ్రమలో కొన్ని సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని… టికెట్ ధరలు.. 5వ షో లాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నాం. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు వస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. థియేటర్లు మూసివేయడం లేదు.. 50 శాతం ఆక్యుపేన్సి గురించి వస్తున్న వార్తలు అవాస్తవం. తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పట్లో థియేటర్లు మూసివేసే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతానికి థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రజలు ధైర్యంగా సినిమాలు చూడోచ్చని.. అన్ని సమస్యలను ఎదుర్కొవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. అఖండ సినిమాతో ఇప్పుడిప్పుడే థియేటర్లకు జనాల రాక పెరిగింది. ఈ సమయంలో దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో వ్యాక్సిన్ రెండు డోసులు దాదాపు పూర్తయ్యాయి. సినీ పరిశ్రమపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. టికెట్ ధరలు పెంపు అంశం ప్రస్తుతం పెండింగ్ లో ఉందన్నారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తామన్నారు.
Also Read: Kiran Abbavaram: ఇలా పరిచయం చేయాల్సి వస్తుందనుకోలేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన యంగ్ హీరో..
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో అదిరిపోయే ట్విస్ట్ .. రీఎంట్రీ ఇవ్వనున్న రవి.. !!
Ananya Nagalla: కుర్రోళ్ళ న్యూ క్రష్ .. యూత్ ను తనవైపు తిప్పుకుంటున్న అనన్య నాగల్ల.. (ఫొటోస్)