Konda Surekha: సమంతకు మంత్రి కొండా సురేఖ ట్వీట్.. ఉద్దేశం అది కాదంటూ..

తెలంగాణ పాలిటిక్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు. సమంత గురించి కొండా సురేఖ చేసిన సంచలన కామెంట్స్‌కి నటి సమంత కౌంటర్‌ ఇవ్వడమే కాదు.. అక్కినేని ఫ్యామిలీ, ఎన్టీఆర్, నాని వంటి టాలీవుడ్ ప్రముఖుల సైతం తీవ్రంగా ఖండించారు.

Konda Surekha: సమంతకు మంత్రి కొండా సురేఖ ట్వీట్.. ఉద్దేశం అది కాదంటూ..
Samantha Vs Konda Surekha
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 03, 2024 | 10:36 AM

తెలంగాణ పాలిటిక్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు. సమంత గురించి కొండా సురేఖ చేసిన సంచలన కామెంట్స్‌కి నటి సమంత కౌంటర్‌ ఇవ్వడమే కాదు.. అక్కినేని ఫ్యామిలీ, ఎన్టీఆర్, నాని వంటి టాలీవుడ్ ప్రముఖుల సైతం తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లోకి వ్యక్తిగత విషయాలను లాగొద్దంటూ మండిపడ్డారు. ఈ తరుణంలో తాజాగా మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంతను ఉద్దేశించి కీలక ట్వీట్ చేశారు.

తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనన్నారు కొండా సురేఖ. మీ మనోభావాలను దెబ్బతీయడం కాదని సమంతను ఉద్దేశించి ట్వీట్ చేశారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడానని కొండా సురేఖ పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

కొండా సురేఖ ట్వీట్..

అసలేం జరిగిందంటే..

ఓ సభలో బీజేపీ ఎంపీ రఘునందన్‌ తనకు మెడలో దండ వేస్తే.. సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేశారని మంత్రి కొండా సురేఖ కన్నీటిపర్యంతమయ్యారు. ఆ ట్రోల్ చేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమేనని ఆరోపించారు. వెంటనే కేటీఆర్, హరీష్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే ట్రోల్‌పై రఘునందన్‌ స్పందించారు. ట్రోల్ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అయితే పోలీసులకు అప్పగించాలని.. లేదంటే ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. ట్రోల్‌తో మొదలైన వివాదంపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. సురేఖకు కలిగిన అవమానానికి బాధపడుతున్నానని అన్నారు. అయితే కేటీఆర్ మాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో సురేఖ మరోసారి కేటీఆర్‌పై విమర్శలు చేశారు. విమర్శలు చేసే క్రమంలో సినిమా ఇండస్ట్రీని, సమంతను మధ్యలోకి లాగారు. ఇండస్ట్రీలో చాలామందికి కేటీఆర్‌ డ్రగ్స్ అలవాటు చేశారన్నారు. ఒకరిద్దరి పేర్లను కూడా ప్రస్తావించారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ తీవ్రస్థాయిలో మండిపడింది. సినిమా వాళ్లకి కేటీఆర్‌కి సంబంధం ఏంటని ప్రశ్నించింది. కేటీఆర్‌కు సురేఖ క్షమాపణలు చెప్పాలన్నారు మాజీ ఎంపీ మాలోతు కవిత. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్‌. సినీ నటుల పేరు వాడుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. 24 గంటల్లో సమాధానం చెప్పకుంటే పరువునష్టం దావా వేస్తానన్నారు. అటు సురేఖ వ్యాఖ్యల్ని ఇండస్ట్రీకి చెందిన పలువురు ఖండిస్తూ.. క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అటు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది అక్కినేని ఫ్యామిలీ. సురేఖ ఆరోపణలు అసంబద్ధం, అబద్ధం అన్నారు అక్కినేని నాగార్జున. మీ ప్రత్యర్థులను విమర్శించడం కోసం.. సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని సూచించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని.. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు నాగార్జున. ఇక.. కొండా సురేఖపై ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు అక్కినేని అమల. ట్విట్టర్‌ వేదికగా ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఒక మంత్రి దెయ్యం పట్టినట్లుగా రాక్షసంగా మాట్లాడారంటూ మండిపడ్డారు. తన భర్త, కుటుంబంపై సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేయడంపై సీరియస్ అయ్యారు. రాజకీయ పరమైన అవసరాల కోసం తమను వాడుకుంటారా.. సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. అంతేకాదు.. రాహుల్‌గాంధీ.. మీరు వ్యక్తుల గౌరవ మర్యాదలను నమ్మినట్లయితే.. దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి.. ఆ మహిళా మంత్రి తమ కుటుంబానికి క్షమాపణలు చెప్పి.. తన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు అమల.

మరోవైపు కొండా సురేఖ కామెంట్స్‌తో సినిమా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. సోషల్‌ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు వరుసగా రియాక్ట్‌ అయ్యారు. సురేఖ వ్యాఖ్యలను మాజీ మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. తోటి మహిళపై వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆమె కామెంట్స్‌ అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్న రోజా.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే.. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా అని ఫైర్‌ అయ్యారు ప్రకాష్‌రాజ్‌. మహిళా మంత్రి వ్యాఖ్యలను ఖండించిన కోనా వెంకట్.. నాగార్జున కుటుంబంపై ఆమె వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సీఎం రేవంత్‌ సీరియస్‌గా తీసుకోవాలని.. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు కోనా వెంకట్‌. అటు.. కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాని సైతం స్పందించారు. ఎంతో గౌరవప్రదమైన హోదా ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదన్నారు. రాజకీయ నేతలు ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకోవడం చూస్తే అసహ్యం వేస్తుందని మండిపడ్డారు. మొత్తంగా.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌ సినీ ఇండస్ట్రీలోనూ దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు సినీ ప్రముఖులు.

ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?