Mehreen Pirzada: నెట్టింట్లో ‘ఎఫ్ 2’ బ్యూటీ మరో రచ్చ.. అలాంటి ఆడవాళ్లు ప్రమాదకరం అంటూ..
మెహ్రీన్ ఫిర్జాదా.. గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఘనంగా నిశ్చితార్థం జరగడం..
మెహ్రీన్ ఫిర్జాదా.. గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఘనంగా నిశ్చితార్థం జరగడం.. ఆ తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో మెహ్రీన్ పేరు ఎక్కువగా వినిపించేది. అయితే అనుహ్యంగా భవ్యతో పెళ్లితో రద్దు చేసుకుంటున్నామని.. ఇకపై తనతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించి అందరికి షాకిచ్చింది. దీంతో మెహ్రీన్ పెళ్లిపై వరుసగా కథనాలు వెలువడ్డాయి. కారణమేంటని వెతికే పనిలో కొందరు నెటిజన్లు ఉండగా.. మరికొందరు భవ్య బిష్ణోయ్‌పై మండిపడ్డారు. అతనితోపాటు.. అతని ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ వచ్చారు. దీంతో భవ్య బిష్ణోయ్ ఘాటుగానే స్పందించారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
అయితే ఇక పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత మెహ్రీన్ మళ్లీ వరుస సినిమాలు, షూటింగ్స్‌తో బిజీ అయ్యింది. తనకు వచ్చిన ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మెహ్రీన్ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఎఫ్ 3 మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మెహ్రీన్ తన సోషల్ మీడియా ఖాతాలో తన లెటేస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులకు ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా.. ఆసక్తికర కామెంట్స్ పెడుతూ రచ్చ చేస్తుంది. “మన దగ్గర ఉన్న కత్తితో సాయం పొంది బతికేందుకు ఇష్టం లేని, తన కాళ్ల మీద తాను బతికే సత్తా ఉన్న మహిళలే అందరికంటే ప్రమాదకరమైన ఆడవాళ్లు” అని చెప్పుకొచ్చారు మెహ్రీన్.
ట్వీట్..
View this post on Instagram
Also Read: Suicide: మితిమీరిన అభిమానం.. నచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిందని నిప్పంటించుకుని అభిమాని ఆత్మహత్య
Sanam Shetty: చంపేస్తానంటూ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు మెసేజ్‌లు.. పోలీసుల అదుపులో నిందితుడు..
Coronavirus: కరోనా జంతువుల నుంచి మనుషులకు.. శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయన్న శాస్త్రవేత్తల బృందం