సీఎం జగన్‌తో చిరంజీవి భేటీకి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే!

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టాలీవుడ్ పెద్దలు ఎవరు జగన్‌ని కలిసింది లేదు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అశ్వినీదత్, దిల్ రాజు లాంటి వాళ్ళు కలవాలని అనుకున్న కానీ జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న‌దీ వినిపించిన మాట‌. దీనిపై వైసీపీలో ఉన్న నటుల మధ్య కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.  అవన్నీ పక్కనపెడితే తాజాగా  మెగాస్టార్ చిరంజీవి జగన్ ని కలవటానికి అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరు మంచి […]

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీకి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే!
Ram Naramaneni

|

Oct 10, 2019 | 3:53 PM

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టాలీవుడ్ పెద్దలు ఎవరు జగన్‌ని కలిసింది లేదు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అశ్వినీదత్, దిల్ రాజు లాంటి వాళ్ళు కలవాలని అనుకున్న కానీ జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న‌దీ వినిపించిన మాట‌. దీనిపై వైసీపీలో ఉన్న నటుల మధ్య కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.  అవన్నీ పక్కనపెడితే తాజాగా  మెగాస్టార్ చిరంజీవి జగన్ ని కలవటానికి అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చిరు మంచి జోష్‌లో ఉన్నారు. ఆయన నటించిన ‘సైరా’ చిత్రం సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక ప్రస్తుతం’సైరా’ ను మరింత ప్రమోట్ చేయడంలో చిరు చాలా బిజీగా ఉన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్  ‘సైరా’ సినిమాని సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా చూపిస్తూ, వారి అభినందనలు అందుకుంటున్న విషయం తెలిసిందే.  తాజాగా తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ ఫ్యామిలీకి స్పెషల్ షో వేసి చూపించారు చిరంజీవి.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ ను కూడా కోరారట మెగాస్టార్. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలవడం వెనుక ఆసక్తికరమైన రీజన్లున్నాయని తెలుస్తోంది. సైరా సినిమా సక్సెస్ గురించి ముఖ్యమంత్రికి వివరించాలని చిరంజీవి భావిస్తున్నారట. అలాగే సీఎంగా ఎన్నికైనందుకు కూడా జగన్ కు కంగ్రాట్స్ చెప్పనున్నారట చిరంజీవి. అంతేకాదు ‘సైరా’  రిలీజ్ టైం‌లో కూడా స్పెషల్ షోలు వేసుకునేందుకు ఏపీ సర్కార్ అనుమతులు ఇచ్చింది. ఆయా కారణాల దృష్ట్యా చిరు..సీఎంను కలవనున్నట్లు తెలుస్తుంది.

జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చిరంజీవి ఆయనతో సమావేశం కాలేదు. చాలా కాలంగా వీరిద్దరూ కలిసింది కూడా లేదు. ఈ నేపథ్యంలో వీరి సమావేశం ఆసక్తిదాయకంగా మారే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం… శుక్రవారం ఉదయం 11 గంటలకు అమరావతిలో సీఎంతో చిరంజీవి, రామ్‌చరణ్‌లు సమావేశంకానున్నారు. ఈ మేరకు సీఎంవో గురువారం అపాయింట్‌మెంట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu