బాబాయ్ పేరు చెప్పగానే.. ‘చిన్న రామయ్య వెక్కి వెక్కి ఏడ్చాడు’..!
పరుచూరి గోపాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకు రచయితగా మంచి పేరు ఉంది. అలాగే.. నటులన్నా.. ఆయనకు అమితమైన ప్రేమ. అందులోనూ.. నందమూరి ఫ్యామిలీకి గోపాలకృష్ణ పెద్ద ఫ్యాన్ అనే చెప్పాలి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. జూనియర్ ఎన్టీఆర్ ఆలియాస్ చిన్న రామయ్య, బాలకృష్ణల గురించి పలు విషయాలు తెలిపారు. ఇటీవలే తన వాట్సాప్‌లోకి ఓ ఫొటో వచ్చిందని.. అది చూసిన తనకు పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకువచ్చాయన్నారు. పరుచూరి గోపాలకృష్ణ.. […]
పరుచూరి గోపాలకృష్ణ ఈ పేరు తెలియని వారుండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకు రచయితగా మంచి పేరు ఉంది. అలాగే.. నటులన్నా.. ఆయనకు అమితమైన ప్రేమ. అందులోనూ.. నందమూరి ఫ్యామిలీకి గోపాలకృష్ణ పెద్ద ఫ్యాన్ అనే చెప్పాలి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. జూనియర్ ఎన్టీఆర్ ఆలియాస్ చిన్న రామయ్య, బాలకృష్ణల గురించి పలు విషయాలు తెలిపారు.
ఇటీవలే తన వాట్సాప్‌లోకి ఓ ఫొటో వచ్చిందని.. అది చూసిన తనకు పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకువచ్చాయన్నారు. పరుచూరి గోపాలకృష్ణ.. ఎన్టీఆర్‌ని చిన్న రామయ్య.. పిలుస్తారు. ఆ ఫొటోలో.. చిన్న రామయ్య.. బాలకృష్ణకు దండ వేసే సందర్భం. అప్పుడే నాకు ‘అల్లరి రాముడు’ చిత్రం జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయన్నారు. ఈ సినిమా షూటింగ్ పాలకొల్లులో జరుగుతోంది. ఆ సెట్‌లో.. నేను ఎన్టీఆర్ మాట్లాడుకుంటున్నాం. ‘ఇంట్లో అందరితోనూ మాట్లాడతావా నాన్నా అని నేను అడగ్గానే.. లేదు.. కానీ పెదనాన్న.. బాబాయ్ అంటే నాకు ప్రాణం. ఒక సగటు అభిమానిలా ఆయన్ని ఆరాధిస్తా’ అని చెప్పుకొచ్చారు. ‘ఏంటి నాన్న.. బాబాయ్‌తో మాట్లాడతావా అని నేను అడగ్గానే.. అక్కడే ఉన్న.. అడ్డాల చంటి ఒడిలో పడుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాడని గోపాలకృష్ణ’ తెలిపారు. ఆ తరువాత.. బాలకృష్ణ కు ఫోన్ చేసి.. చిన్నరామయ్యతో మాట్లాడమని ఇచ్చాను. బహుశా అదే.. మొదటిసారి వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు అనుకుంట అని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత 2001లో సినీ గోయర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ఇద్దరినీ పిలిపించి.. తారక్ చేత బాలయ్యకు దండ వేయించా. అప్పుడు ఆ సమయంలో.. చిన్నరామయ్య స్టేజ్‌పై భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తరువాత.. ఇద్దరి మెడలోనూ ఒకే దండ వేయించాం. ఆ తరువాత శిల్ప కళావేదికలో అల్లరి రాముడు 100 రోజుల కార్యక్రమం జరిగింది. అప్పుడు హరికృష్ణకు, చిన్నరామయ్యకు కలిసి ఒకే దండ వేసినట్టు పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.