Chiranjeevi: అభిమానుల కోసం మెగాస్టార్ సంచలన నిర్ణయం.. సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఏ హీరో చేయలేనివిధంగా..
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) అంటే అభిమానులకు పండగే. అయితే ఈసారి ఆ పండగ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసేలా తన మెగా అభిమానుల కోసం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మెగాస్టార్. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం రండి.

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏలుతోన్న ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. చిరంజీవి కొత్త సినిమా రిలీజైనా ఆయన పుట్టిన రోజు వచ్చినా మెగాభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు. ఆ రోజున చిరంజీవి పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతారు మెగా ఫ్యాన్స్. అన్నదానం, రక్తదానం ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మెగాభిమానులమని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకటి.. రెండేళ్లు కాదు.. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తోన్న తన మెగాభిమానుల కోసం చిరంజీవి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రానున్న ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులకు రూ.5 లక్షల మేర ఇన్సూరెన్స్ చేయించబోతున్నారట. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు.
‘ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సీనియర్ అభిమానులను అన్ని ప్రాంతాల్లో గుర్తించి సత్కరించాలి అనుకుంటున్నాం. అలాగే మూడు దశాబ్దాలుగా కష్టపడి పనిచేసిన సీనియర్ అభిమానులు, అప్పటి నుంచి ఇప్పటివరకు థియేటర్స్ దగ్గర కష్టపడినవాళ్లు, కటౌట్లు కట్టి, పూల దండలు వేసి, పాలాభిషేకాలు చేసి, సేవా కార్యక్రమాలు చేసిన వాళ్లు చాలా మంది సీనియర్ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వారందరిని గుర్తించే పనిలో ఉన్నాం. ఈ పుట్టిన రోజున చిరంజీవి సీనియర్ అభిమానులను గుర్తించి వారందరికీ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ అఖిల భారత చిరంజీవి సంఘం తరపున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. మొదటగా గుంటూరు జిల్లా నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం’ అని రవణం స్వామి నాయుడు చెప్పుకొచ్చారు.
సీనియర్ అభిమానులను గుర్తించి..
*మెగాస్టార్ సీనియర్ అభిమానులకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది* .
అభిమాన జనో రక్ష రక్ష అనే నినాదంతో *శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారి* విజయంలో & మెగా సేవలో ఎంతగానో ముఖ్య భూమిక పోషించిన అభిమానులకు పేరుపేరునా *ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్* pic.twitter.com/b5TZp33f97
— Ravanam Swami naidu (@swaminaidu_r) July 19, 2026
ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన చిరు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ చరిత్రంలో ఏ హీరో ఇలా అభిమానులకు ఇన్సూరెన్స్ చేయించలేదని, మెగాస్టారే ఇలాంటి మంచి కార్య క్రమానికి శ్రీకారం చుట్టారని పలువురు అభినందిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22 నుంచే ఈ గొప్ప కార్యక్రమం మొదలుపెడతారని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




