Acharya: మెగాస్టార్ మూవీకి భారీ డిమాండ్.. “ఆచార్య” ఓటీటీ రైట్స్ దక్కించుకుంది ఎవరో తెలుసా..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆశ్చర్యంలో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికె విడుదలైన ఈ సినిమా టీజర్ , లాహే లాహే.., నీలాంబరి పాటలు ప్రేక్షకులను విపార్టీతంగా ఆకట్టుకున్నాయి. ఆచార్య ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతుందని తెలుస్తుంది. చిరంజీవి- చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమా అన్ని ఏరియాల్లో భారీ వసూళ్లను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈక్రమంలోనే ఆచార్య సినిమా ఓటీటీ రైట్స్ కోసం పలు అంస్థలు పోటీ పడుతున్నాయి. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఆచార్య స్ట్రీమింగ్ ను దక్కించుకుందని తెలుస్తుంది. ఇందుకోసం అమెజాన్ భారీ మొత్తంలో ఆచార్య కు ముట్టజెప్పారని తెలుస్తుంది. సురేఖ్ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతకాలపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో చరణ్ సిద్ద అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో చరణ్ నక్సలైట్ గా కనిపించనున్నాడు. ఇక చరణ్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. నవంబర్ 28న విడుదల ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :