Acharya Movie : మెగాస్టార్ ఆచార్య పై ఆగని గుసగుసలు.. మళ్లీ రిలీజ్ వాయిదా అంటున్నారే..

మెగాస్టార్ చిరంజీవి.. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’.

Acharya Movie : మెగాస్టార్ ఆచార్య పై ఆగని గుసగుసలు.. మళ్లీ రిలీజ్ వాయిదా అంటున్నారే..
Acharya
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 26, 2021 | 1:11 PM

Acharya : మెగాస్టార్ చిరంజీవి.. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతుందంటూ నెట్టింట వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే వార్త‌లను ఇటీవలే నిర్మాత‌లు ఖండించారు.

‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4నే ఆచార్య చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున‌ విడుదల చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయ్యింది. అనౌన్స్ మెంట్ చేసిన రోజు నుంచే సినిమా విడుదలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు మెగా ఫ్యాన్స్, అటు ప్రేక్ష‌కులు సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. అంద‌రి అంచ‌నాల‌కు త‌గిన‌ట్లే ఆచార్య సినిమా ఉంటుంది’’ అన్నారు.

అయితే ఆచార్య సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కరోనా థర్డ్ వేవ్ తోపాటు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై స్పష్టమైన ప్రకటన లేదు. ఇక ఇప్పుడు ఆచార్య సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొత్తవేరియెంట్ తోపాటు టికెట్ల ధర విషయంలో ఏపీ ప్రభుత్వానికి.. సినిమా ఇండస్ట్రీకి కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో కూడా సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. దాంతో త్వరలోనే ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా న‌టించిన ఆచార్యకి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: వెండితెరకు పరిచయం కానున్న మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. సినిమా పోస్టర్‌ విడుదల..

Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే..

Viral Video: మరోసారి అదరగొట్టిన నైనిక, తనయ.. ఈసారి ‘సామి సామి’ అంటూ నెటిజన్లను కట్టిపడేశారు..