Squid Game: 10 రోజుల్లో 4 కిలోలు తగ్గిపోయిన స్క్విడ్‌ గేమ్‌ ముద్దుగుమ్మ.. ఎందుకంటే..

స్క్విడ్‌ గేమ్‌..సినీ ప్రేక్షకులకు ఈ సిరీస్‌ గురించి ప్రత్యేక పరిచయం లేదు. కొన్నిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ కొరియన్ వెబ్‌సిరీస్‌ ఓటీటీలోనే అత్యధికంగా వ్యూస్ సొంతం చేసుకున్న షోగా మంచి గుర్తింపు పొందింది. ఈ సిరీస్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్‌తో పాటు తె

Squid Game: 10 రోజుల్లో 4 కిలోలు తగ్గిపోయిన స్క్విడ్‌ గేమ్‌  ముద్దుగుమ్మ.. ఎందుకంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 26, 2021 | 1:13 PM

స్క్విడ్‌ గేమ్‌..సినీ ప్రేక్షకులకు ఈ సిరీస్‌ గురించి ప్రత్యేక పరిచయం లేదు. కొన్నిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ కొరియన్ వెబ్‌సిరీస్‌ ఓటీటీలోనే అత్యధికంగా వ్యూస్ సొంతం చేసుకున్న షోగా మంచి గుర్తింపు పొందింది. ఈ సిరీస్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళ, మలయాళ వంటి ప్రాంతీయ భాషల్లోకి కూడా దీనిని అనువదించారు. ప్రస్తుతం వాటి ప్రమోషన్‌ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసే పనిలో ఉంది చిత్రబృందం. ఇందులో భాగంగానే పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. కాగా ‘స్క్విడ్‌ గేమ్‌’ లో కొరియన్‌కు చెందిన ప్రముఖ మోడల్‌ హోయెన్ జంగ్ ఓ కీలకపాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం సిరీస్‌ ప్రమోషన్లలోనూ విస్తృతంగా పాల్గొంటుందీ ముద్దుగుమ్మ. ఈక్రమంలోనే జంగ్ కేవలం 10 రోజుల్లో సుమారు 4 కేజీల బరువు తగ్గిందంట.

దుస్తులు వదులైపోయాయి.. దీనిపై స్పందించిన ఆమె.. ‘ ‘స్క్విడ్‌ గేమ్‌’ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో బాగా తిరిగాం. ఈ సమయంలో తినడానికి మాకు సమయమే దొరకలేదు. దీంతో బాగా బరువు తగ్గిపోయాను. అక్కడికి వెళ్లేముందు నాకు బాగా ఫిట్ అయ్యే దుస్తులు వెనక్కి వచ్చేటప్పుడు చాలా వదులైపోయాయి’ అని వాపోయింది. కాగా సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేస్తోన్న ఫొటోల్లో మరీ బక్కచిక్కిపోయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది నెటిజన్లు ఆమెకు జాగ్రత్తలు చెబుతున్నారు. ‘మిమ్మల్ని అలా బ్లాక్‌ డ్రెస్‌లో అలా చూడడం నాకు ఆందోళన కలిగిస్తోంది’, ‘మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి’, ‘ సరైన ఆహారం తీసుకోండి’ అని కామెంట్లు పెడుతున్నారు.

Also Read:

Merry Christmas: విజయ్‌ సేతుపతితో జోడీ కట్టనున్న కత్రినా.. డైరెక్టర్‌ ఎవరంటే..

Singer Sayali kamble: స్నేహితునితో ఇండియన్‌ ఐడల్‌ రన్నరప్‌ ఎంగేజ్‌మెంట్‌.. సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌..

Padmaja Konidela Birthday: సతీమణి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన మెగా బ్రదర్‌.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌ ..

సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..
సంక్రాంతి మూడు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..