AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Merry Christmas: విజయ్‌ సేతుపతితో జోడీ కట్టనున్న కత్రినా.. డైరెక్టర్‌ ఎవరంటే..

తమిళ విలక్షణ నటుడు, మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా, విలన్‌గా అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇటీవల పెళ్లిపీటలెక్కిన కత్రినా కైఫ్‌ మళ్లీ సి

Merry Christmas: విజయ్‌ సేతుపతితో జోడీ కట్టనున్న కత్రినా.. డైరెక్టర్‌ ఎవరంటే..
Basha Shek
|

Updated on: Dec 26, 2021 | 12:48 PM

Share

తమిళ విలక్షణ నటుడు, మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా, విలన్‌గా అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇటీవల పెళ్లిపీటలెక్కిన కత్రినా కైఫ్‌ మళ్లీ సినిమాలతో బిజీగా మారేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి స్ర్కీన్‌ను షేర్‌ చేసుకోనున్నారు. ఆ సినిమా పేరు ‘మేరీ క్రిస్మస్‌’. గతంలో ‘ఏజెంట్‌ వినోద్‌’, ‘బద్లాపూర్‌’, ‘అంధాదూన్‌’ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్‌ రాఘవన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కాగా క్రిస్మస్‌ పండగను పురస్కరించుకుని ‘మేరీ క్రిస్మస్‌’ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంది కత్రిన.

ఈ సందర్భంగా విజయ్‌ సేతుపతితో పాటు దర్శకనిర్మాతలతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్న క్యాట్‌.. ‘దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం నిజంగా నా అదృష్టం . ఆయన దర్శకత్వంలో నటించాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. కథను థ్రిల్లింగ్‌గా రూపొందించడంలో ఆయన మాస్టర్‌. విజయ్‌ సేతుపతితో కలిసి నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాగా రమేశ్‌ తరౌణి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ముంబయిలో ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా 2022 డిసెంబర్‌ 23న ఈ సినిమాను విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

Also Read: Singer Sayali kamble: స్నేహితునితో ఇండియన్‌ ఐడల్‌ రన్నరప్‌ ఎంగేజ్‌మెంట్‌.. సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌..

Padmaja Konidela Birthday: సతీమణి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన మెగా బ్రదర్‌.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌ ..

Kartik Aaryan: లేడీ ఫ్యాన్‌కు ఫ్రాంక్‌ కాల్‌ చేసిన బాలీవుడ్‌ హ్యాండ్సమ్ హీరో.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..