మెగాస్టార్‌లో మరో ‘స్టార్’..!

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ వుంది. ఆయన గురించి.. ఆయన నటన గురించి  ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మెగాస్టార్‌ డ్యాన్స్‌కి నేటి తరం నుంచి పాత తరం అభిమానులకు చాలా ఇష్టం. అయితే.. ఆయనలో ఇవే.. కాకుండా.. దర్శకుడు కూడా దాగివున్న సంగతి తాజాగా తెలిసింది. ఈ మధ్యే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ఇంద్ర’ సినిమా షూటింగ్‌లో కొన్ని సన్నివేశాలకు తానే దర్శకత్వం వహించానని చెప్పుకొచ్చారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:43 pm, Sun, 18 August 19
మెగాస్టార్‌లో మరో 'స్టార్'..!

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ వుంది. ఆయన గురించి.. ఆయన నటన గురించి  ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మెగాస్టార్‌ డ్యాన్స్‌కి నేటి తరం నుంచి పాత తరం అభిమానులకు చాలా ఇష్టం. అయితే.. ఆయనలో ఇవే.. కాకుండా.. దర్శకుడు కూడా దాగివున్న సంగతి తాజాగా తెలిసింది. ఈ మధ్యే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

‘ఇంద్ర’ సినిమా షూటింగ్‌లో కొన్ని సన్నివేశాలకు తానే దర్శకత్వం వహించానని చెప్పుకొచ్చారు. అప్పట్లో.. డైరెక్టర్ రాఘవేంద్రరావు, బి. గోపాల్ , విజయబాపినీడు వంటి వాళ్లకు నా మీద నమ్మకం ఎక్కువగా ఉండేదని.. అప్పుడప్పుడు అనుకోని పనుల్లో వాళ్లు.. బయటకు వెళ్లినప్పుడు.. బాబాయ్‌ .. ఈ సీన్ ఎలా చేయాలో నీకు తెలుసుకదా..! చేయించు అని చెప్పి వెళ్లేవారని తెలిపారు. ఆ సందర్భంలోనే ఇంద్రతో పాటు మరికొన్ని సినిమాలకు కొన్ని సన్నివేశాలు నేనే డైరెక్ట్ చేశానని చెప్పుకొచ్చారు. అలాగే.. కొన్ని సినిమాలకు.. ఈ సీన్ ఎలా తీస్తే బావుంటుందని దర్శకులు తనతో సంప్రదించేవారని కూడా చెప్పారు చిరు.

ఈ క్రమంలోనే.. చాలా మంది నన్ను డైరెక్షన్ చేయవచ్చు కదా అని సలహాలు ఇచ్చేవారని.. కానీ.. నాకు యాక్టింగ్, డైరెక్షన్ రెండూ చేయలేనని.. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తానని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.