AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saaho: వండర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్.. నో డౌట్ !

స్పై థ్రిల్లర్, పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ అయినా ‘ సాహో ‘ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటీవలికాలంలో అత్యంత భారీ బడ్జెట్ తో, అత్యున్నత నిర్మాణ విలువలతో, హాలీవుడ్ రేంజిలో దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు ప్రభాస్, శ్రధ్ధాకపూర్, నీల్ నితిన్ ముఖేష్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం కథ స్థూలంగా ఇది ! 2 .వేల కోట్ల రాబరీ చేసిన మాఫియా […]

Saaho: వండర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్.. నో డౌట్ !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2019 | 4:38 PM

Share

స్పై థ్రిల్లర్, పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ అయినా ‘ సాహో ‘ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటీవలికాలంలో అత్యంత భారీ బడ్జెట్ తో, అత్యున్నత నిర్మాణ విలువలతో, హాలీవుడ్ రేంజిలో దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు ప్రభాస్, శ్రధ్ధాకపూర్, నీల్ నితిన్ ముఖేష్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం కథ స్థూలంగా ఇది !

2 .వేల కోట్ల రాబరీ చేసిన మాఫియా ముఠాను పట్టుకునేందుకు అండర్ కవర్ ఏజంట్ అయినప్రభాస్ బయల్దేరతాడు. ఈ మిషన్ లో అతనికి క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అయిన అమృతా నాయర్ (శ్రధ్ధాకపూర్) కూడా తోడ్పడుతుంది. అదే సమయంలో నీల్ నితిన్ ముఖేష్ తో కూడిన విలన్ల బృందం కోట్లకొద్దీ డాలర్లతో ఉన్న లాకర్ ను తెరిచేందుకు ఉపయోగపడే బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తుంటుంది. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు సాహో ప్రయత్నిస్తుంటాడు. ఒక దశలో శ్రధ్ధాకపూర్, సాహో మధ్య ప్రేమ చిగురిస్తుంది. విలన్ల ముఠాను ఎదుర్కునే సమయంలో వారి దాడిలో ఆమె కూడా ప్రాణాపాయంలో పడుతుంది. ఓ వైపు ఆమెను రక్షించడం, మరోవైపు మాఫియా ముఠాను పట్టుకునేందుకు సాహో చేసే సాహసాలు, స్టంట్లు ఈ చిత్రానికి ప్రాణం పోస్తాయి.

కామెడీ, రొమాన్స్ , హై డోస్ యాక్షన్ సీన్స్ తో క్షణక్షణం ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో సుజిత్ తీశాడీ చిత్రాన్ని. ఎక్కువగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద యాక్షన్, ఫైట్ సీన్స్ చిత్రీకరించారు. తెలుగుతో బాటు తమిళం, హిందీలోనూ విడుదల కానుంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ‘ నభూతో న భవిష్యతి ‘ అన్న తీరులో అప్పుడే ప్రీ రిలీజ్ కలెక్షన్స్ ని కూడా రాబట్టేసింది. ‘ సైకో సయ్యన్ ‘, ‘ ఏ చోటా నువ్వున్నా ‘ అనే రెండు పాటలను చిత్ర బృందం రిలీజ్ చేసింది. . ఇక టీజర్, ట్రైలర్ల గురించి వేరే చెప్పాలా ? వీటిని వీక్షించిన ‘ డార్లింగ్ ‘ ఫ్యాన్స్ .. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 30 న విడులవుతోంది గానీ.. అంతవరకు ఆగుతారా.. అన్నది సందేహమే.. కానీ తప్పదు.. ఎన్ని స్క్రీన్స్ లో రిలీజవుతోందన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఈ మూవీ ఆడే థియేటర్ల వద్ద పెద్దఎత్తున జనం ‘ కుంభమేళా ‘ ను తలపించినా ఆశ్చర్యం లేదంటున్నారు.