Megastar Chiranjeevi: వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి రైతుకి సెల్యూట్ చెప్పిన చిరు..
Megastar Chiranjeevi: ఆరుగాలం రైతు ఎన్నో కష్టనష్టాలకోర్చి పంట పండిస్తేనే కంచంలో మెతుకు చేరుతుంది. అందుకనే రైతు లేనిదే మనిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక..
Megastar Chiranjeevi: ఆరుగాలం రైతు ఎన్నో కష్టనష్టాలకోర్చి పంట పండిస్తేనే కంచంలో మెతుకు చేరుతుంది. అందుకనే రైతు లేనిదే మనిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. అతివృష్టి, అనావృష్టి ఇలాంటి అనేక కష్టనష్టాలను తట్టుకుని అన్నదాత అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం మెతుకు రాదు.. డిసెంబర్ 23న జాతీయ జాతీయ రైతుదినోత్సవం జరుపుకున్నాం.. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి రైతన్నకు తనదైన శైలిలో శుభాకాంక్షలను చెప్పారు. రైతు కష్టం.. పంట చేతికి వస్తే ఆ రైతుపొందే ఆనందాన్ని వీడియో ద్వారా వివరించారు.
పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. అంతేకాదు.. అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు కి సెల్యూట్ చెప్పారు చిరు.
అంతేకాదు.. ప్రకృతి ఎంత గొప్పది అంటే.. మన సరదాగా ఒక విత్తనం భూమిలో నాటితే… అది మనకు కడుపు నింపే ప్రయత్నం చేస్తుంది. దానికి మనం ఎంత గొప్పగా కృతజ్ఞతగా ఉన్నాం.. ఉంటామాన్నది తెలియాల్సి ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒక తొట్టిలోనైనా విత్తనం నాటండి… స్వయంగా పండించిన కూరగాయలతో వండిన వంట ఎంతో రుచికరంగా ఉంటుందని చిరంజీవి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
Also Read: పిల్లల ముందు పెద్దలు ఎప్పుడూ ఇలా ప్రవర్తించకండి.. లేకపోతే తల్లిదండ్రులు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది