Love Story: నాగచైతన్య సాయిపల్లవి లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌లుగా బడా హీరోలు..
ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మూవీ ఒకటి. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య- ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న
Love Story: ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ మూవీ ఒకటి. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య- ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తక్కువ టైమ్‌లోనే ఎక్కువ లైక్స్ వచ్చిన టీజర్‌గా నిలిచింది. ఇక రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనున్నారు చిత్రయూనిట్. ఇక కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఆతర్వాత షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటే నాని టక్ జగదీశ్ సినిమా షాక్ ఇచ్చింది. ముందుగా వినాయక చవితి సందర్భంగా సినిమాను రిలీజ్ చేద్దాం అనుకుంటే అదే రోజు నాని సినిమా ఓటీటీ వేదికగా విడుదల అంటూ ప్రకటించింది. దాంతో చిన్నపాటి రచ్చ కూడా జరిగింది.
గ్రామాల నుంచి ఎదో సాధించడానికి హైదరాబాద్ సిటీకి వచ్చిన ఇద్దరు ప్రేమికుల కథగా ఈ సినిమాను రూపొందించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో కూడా స్పీడ్ పెంచింది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని చూస్తున్నారట చిత్రయూనిట్. ఇందుకోసం ఇద్దరు స్టార్ హీరోలను గెస్ట్‌లుగా పిలవనున్నారని తెలుస్తుంది. ఇక నాగ్ చిరు ఇద్దరు మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. ఒకరింటి ఫంక్షన్స్ కు ఒకరు వెళ్తూ వుంటారు. ఇక ఇప్పుడు చైతన్య సినిమా ప్రీరిలీజ్‌కు మెగాస్టార్ రావడం అక్కినేని అభిమానుల్లో మరింత జోష్ పెంచింది. స్టేజ్ పై చిరు చైతన్య గురించి ఏం మాట్లాడుతారా అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ రావడంతో అటు మెగా అభిమానుల నుంచి కూడా సినిమాకు హైప్ రావడం ఖాయమని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.
మరిన్ని ఇక్కడ చదవండి :