Ram Charan: జోగినిపల్లి పుస్తకం “వింగ్స్ ఆఫ్ పాషన్” న్ను ఆవిష్కరించిన గ్లోబల్ స్టార్ రాంచరణ్
యంపీ సంతోష్ కుమార్ తీసిన ఛాయాచిత్రాలతో కూడిన “వింగ్స్ ఆఫ్ పాషన్” (Wings of Passion) పుస్తకాన్ని ఇవ్వాల తన నివాసంలో జోగినిపల్లితో కలిసి రాంచరణ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “పక్షులతో ఉన్నప్పుడు నిశ్శబ్ధంగా ఉండమని” బుక్ లో వారు చెప్పిన మాట నా హృదయాన్ని హత్తుకుంది. జీవుల పట్ల ఎంతో కరుణా, జాలి, ప్రేమ, వాటితో నిరంతర సహవాసం ఉంటే తప్పా.. అద్భుతమైన ఆ తత్వాన్ని అర్ధం చేసుకోలేం.
“రాజకీయం, ప్రజాసేవలో ఉంటూ.. కళల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని. అలాంటి అరుదైన, మంచి మనసున్న వ్యక్తి మన రాజ్యసభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్” అన్నారు గ్లోబల్ స్టార్ రాంచరణ్. యంపీ సంతోష్ కుమార్ తీసిన ఛాయాచిత్రాలతో కూడిన “వింగ్స్ ఆఫ్ పాషన్” (Wings of Passion) పుస్తకాన్ని ఇవ్వాల తన నివాసంలో జోగినిపల్లితో కలిసి రాంచరణ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “పక్షులతో ఉన్నప్పుడు నిశ్శబ్ధంగా ఉండమని” బుక్ లో వారు చెప్పిన మాట నా హృదయాన్ని హత్తుకుంది. జీవుల పట్ల ఎంతో కరుణా, జాలి, ప్రేమ, వాటితో నిరంతర సహవాసం ఉంటే తప్పా.. అద్భుతమైన ఆ తత్వాన్ని అర్ధం చేసుకోలేం.
పక్షులు, మూగజీవాలను అర్ధం చేసుకోవడానికి వారు ఎంత శ్రమించారో చెప్పడానికి ఆ ఒక్క మాట సరిపోతుంది. దేశంలో ఎందరో ఫోటోగ్రాఫర్లు ఉండొచ్చు కానీ.. రాజకీయ రంగం నుంచి వచ్చి ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లా ఫోటోలు తీసి.. వాటిని పుస్తకంగా తీసుకొచ్చిన నేత బహుశ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఒక్కరే కావచ్చని నా అభిప్రాయం.
రామ్ చరణ్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
“కళ, కళ కోసం కాదు.. ప్రజల కోసం” అన్నారు మన పెద్దలు. సంతోష్ కుమార్ గారు తన ఫోటోల ద్వారా పక్షులు, జంతువుల, వాటి ఆవాసాలు, వాటి జీవవైవిధ్యాన్ని తన ఫోటోల ద్వారా ఆవిష్కరిస్తూ.. తన కళను ప్రదర్శిస్తూ.. పక్షులు, మూగజీవాల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు.
రామ్ చరణ్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఇది ఎంతో పరిణతితో కూడిన బాధ్యత. అంతేకాదు, పక్షులకు దూరమైన మొక్కలు నాటిస్తున్నారు.. మరో పక్క వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. నిరంతరం ప్రకృతి సమతూల్యత కోసం పరితపిస్తున్నారు. నిజంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి కృషికి హ్యాట్సాఫ్ అంటూ అభినందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.